దేవుడితో పెట్టుకుంటే బతకలేరు: వాసుపల్లి | Vasupalli Ganesh Kumar Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

దేవుడితో పెట్టుకుంటే బతకలేరు: వాసుపల్లి

Sep 20 2024 11:59 AM | Updated on Sep 20 2024 12:47 PM

Vasupalli Ganesh Kumar Comments On Chandrababu

లడ్డూ తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ నిలదీశారు.

సాక్షి, విశాఖపట్నం: లడ్డూ తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ నిలదీశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్‌ మీద ఓ నింద వేసేస్తే సరిపోతుందనుకున్నారు. జగన్‌, చంద్రబాబు హయాంలో ఆలయాల పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. తిరుమలకు వేలాది మందిగా తరలివస్తాం. దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బతకలేరు.’’ అని వాసుపల్లి గణేష్‌ చెప్పారు.

‘‘విజయవాడ వరదలు మీద సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబు నిర్లక్ష్యం వలనే వరద సంభవించింది. 50 మరణాలు అంటే సామాన్య విషయం కాదు. వంద రోజుల పాలనలో కూటమి నేతలు ఒకరిని మరొకరు కీర్తించుకుంటున్నారు. వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. వరద బాధితులకు వైఎస్ జగన్ అయితే 25 వేలకు బదులు లక్ష రూపాయలు ఇచ్చేవారు.’’ అని వాసుపల్లి గణేష్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement