బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్

Uttar Pradesh Election 2022: Akhilesh And Jayant vow To Fight For Farmers Till The End - Sakshi

లక్నో: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో యూపీలో ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ కూటమి చివరి వరకు రైతుల శ్రేయస్సు కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాగా, తాను, ఆర్ఎల్​డీకి చెందిన నేత జయంత్​ చౌదరి రైతుల మానస కుమారులుగా అఖిలేష్ అభివర్ణించుకున్నారు.

‘నేను ఎప్పుడూ నా జేబులో ఒక ప్యాకెట్ ఉంచుకుంటాను.. లాల్​ టోపి, లాల్​ పొట్లీని’ ఉంచుకుంటానని తెలిపారు. బీజేపీని ఓడించడమే నా సంకల్పమని అఖిలేష్​ తెలిపారు. 2017 నుంచి ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హమీని కాషాయపార్టీ నెరవేర్చలేదని అఖిలేష్​ విమర్శించారు.  అదే విధంగా జయంత్​ చౌదరి కూడా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. జయంత్​ షాను బీజేపీలో చేరాలని అమిత్​ షా ఆహ్వనించారు.

దీనిపై జయంత్​ స్పందించారు. తాను నాణెంలా ఎగిరేవ్యక్తి కాదని తెలిపారు. పశ్చిమ యూపీలో జాట్​ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు షా.. ఆర్ఎల్​డీ చీఫ్​ను పార్టీలోని ఆహ్వనించినట్లు తెలుస్తోంది. అయితే, దీన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదే విధంగా.. జాట్​ నాయకులతో మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని జయంత్​ తెలిపారు.

ఈ సమావేశంలో యూపీ ఎంపీ సంజీవ్​ బల్యాన్ సహా పార్టీ ప్రముఖ జాట్ నేతలు హజరయ్యారు. పశ్చిమ యూపీలో ఆర్ఎల్​డీ అధికారంలో ఉన్న అన్ని స్థానాల్లో జాట్​లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాగా, మాజీ ప్రధాని చరణ్​ సింగ్​ మనవడు జయంత్​ చౌదరి ప్రస్తుతం ఆర్ఎల్​డీకి  నేతృత్వం వహిస్తున్నారు. ఈ పార్టీ ఎస్పీతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తుంది. 

చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top