ఎల్‌. రమణ నాకు మంచి స్నేహితుడు: కేసీఆర్‌ | TS CM KCR Invites L Ramana To TRS Party At Telangana Bhavan | Sakshi
Sakshi News home page

ఎల్‌. రమణ నాకు మంచి స్నేహితుడు: కేసీఆర్‌

Jul 16 2021 3:51 PM | Updated on Jul 16 2021 4:25 PM

TS CM KCR Invites L Ramana To TRS Party At Telangana Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ జూలై 12న టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎల్‌.రమణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఎల్‌.రమణ నాకు మంచి స్నేహితుడు. తనకు మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది. ఎల్‌.రమణ తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తారు. చేనేత వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కావాలి. చేనేతలను బాధల నుంచి విముక్తి కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement