దుబ్బాకలో గెలిచి తీరాలి  | Tpcc Chief Uttam Kumar Reddy Speaks About Dubbaka By Elections | Sakshi
Sakshi News home page

దుబ్బాకలో గెలిచి తీరాలి 

Sep 12 2020 3:01 AM | Updated on Sep 12 2020 5:20 AM

Tpcc Chief Uttam Kumar Reddy Speaks About Dubbaka By Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి తీరాలని, ఆ దిశలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నేతలు కలసికట్టుగా పనిచేయాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రస్తుతం రాజకీ య వాతావరణం మారిపోయిందని, దీన్ని సద్వినియోగం చేసుకుని దుబ్బాకలో కాంగ్రెస్‌ కొట్టే దెబ్బకు కేసీఆర్‌ దిమ్మ తిరగాలన్నారు. శుక్రవా రం గాంధీభవన్‌లో దుబ్బాక నియోజకవర్గానికి చెందిన గ్రామస్థాయి నేతలతో జరిగిన సమీక్షలో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. మూడ్రోజుల్లోగా దుబ్బాకలోని అన్ని మండలాల కమిటీలు పూర్తి చేయాలని కోరారు. వారంలో అన్ని గ్రామాల్లో పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలు పూర్తి చేసి ఎప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ కేడర్‌ ఈ ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించి అధికార టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement