
సాక్షి, వరంగల్: ప్రీతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తప్పుచేసినవారు సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ప్రీతి ఎపిసోడ్‌పై స్పందిస్తూ ఈమేరకు మాట్లాడారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆమె ప్రమాదకర ఇంజెక్షన్లు తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. ప్రీతి ఎపిసోడ్‌పై పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు.
చదవండి: ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే..