టీఆర్‌ఎస్‌ మంత్రులు కబ్జాకోరులు | Telangana: Congress Leader Dasoju Sravan Comments On TRS Ministers | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ మంత్రులు కబ్జాకోరులు

Aug 30 2021 2:04 AM | Updated on Aug 30 2021 2:04 AM

Telangana: Congress Leader Dasoju Sravan Comments On TRS Ministers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రాష్ట్రంలో కబ్జాకోరులుగా తయారయ్యారని, కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మింగేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో కలిసి ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలను విడుదల చేశారు. గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్‌ భూములకు సంబంధించిన పత్రాలు, మల్లారెడ్డి కళాశాల గురించి న్యాక్‌ ఇచ్చిన నివేదికను మీడియాకు అందజేశారు. మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధారాలతో సహా ఆరోపణలు చేసినా సీఎం కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.  

Advertisement
 
Advertisement
Advertisement