Telangana BJP Chief Bandi Sanjay Challenges CM KCR - Sakshi
Sakshi News home page

నేను రాజీనామా చేస్తా..! సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌..

Sep 12 2022 4:38 PM | Updated on Sep 12 2022 4:58 PM

Telangana BJP Chief Bandi Sanjay Challenges CM KCR - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్రం ఇచ్చిన గెజిట్‌లో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉందని, మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్‌ కూడా ఇవొద్దని బిల్లులో చెప్పారంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోటర్ల మీటర్లపై కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు.
చదవండి: ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం నోటీసులు పంపింది: కేసీఆర్‌ ఫైర్‌

బండి సంజయ్‌ నాలుగో విడత పాదయాత్ర ప్రారంభమైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 10 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం పెట్టిన బిల్లును కేసీఆర్‌కు పంపిస్తా.. కేంద్ర బిల్లులో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉంటే నేను రాజీనామా చేస్తా?. లేకుంటే సీఎం కేసీఆర్‌ రాజీనామా చేస్తారా? అంటూ  మండిపడ్డారు. చిన్న వర్షం పడినా హైదరాబాద్‌ మునిగిపోతుంది. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌ చేస్తామన్న హామీ ఏమైంది? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement