
Telangana Assembly Elections Updates
కుత్బుల్లాపూర్ విజయభేరిలో రేవంత్‌రెడ్డి కామెంట్స్
- నన్ను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలది
- నేను ఈ స్థాయికి చేరడంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ దాగుంది
- కాంగ్రెస్‌ను గెలిపించేందుకు నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతా
- కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తుండు..
- తెలంగాణలో నాగార్జున సాగర్, బీమా,కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్
- సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది
- కనిపించే ఈ వెలుగు జిలుగులు కాంగ్రెస్ వల్లే
- చింతమడకలో కేసీఆర్ చదివిన బడి కూడా కాంగ్రెస్ కట్టిందే
- హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్
జూబ్లీహిల్స్ రోడ్ షోలో కేటీఆర్
- విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలి
- అజారుద్దీన్ వస్తే క్రికెట్ ఆడండి కానీ ఓటు మాత్రం మాగంటి గోపీనాథ్‌కు వేయండి
- అజారుద్దీన్‌కు ఏ గల్లీ తెలియదు, జూబ్లీహిల్స్‌లో ఏ మనిషి తెలియడు
- కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న మోజు తెలంగాణ ప్రజల మీద లేదు
- కాంగ్రెస్ లో 11 మంది సీఎంలు రెడీ గా ఉన్నరు
- కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం
- కాంగ్రెస్ పార్టీ ఎందుకు మెట్రో రైలు పూర్తి చేయలేక పోయింది
- హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కల్లుండి చూడలేక పోతున్నారు
- అజారుద్దీన్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి తన్ని తరిమేశారు
- యూపీ లో చెల్లని అజారుద్దీన్ తెలంగాణ హైదరాబాద్‌లో ఎలా చెల్లుతారు?
- అధికారంలోకి రాగానే 18 యేళ్లు నిండిన ఆడబిడ్డలకు 3000 పెన్షన్ ఇస్తాం
- వరల్డ్‌కప్‌లో ఇండియా గెలవడం పక్కా, తెలంగాణ ఎన్నికల్లో కేసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా.
కుత్బుల్లాపూర్ విజయభేరి సభలో ఖర్గే కామెంట్స్
- తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంతా ఒక్కటే
- ప్రధాని మోదీ,కేసీఆర్ దేశాన్ని ,రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
- కాంగ్రెస్ పార్టీ తోనే పేదల బతుకులు మారుతాయి
- ఎన్ని ఉద్యమాలు చేసినా చివరికి తెలంగాణ ప్రజల ఆశ తీర్చింది సోనియా గాంధీనే
- మోదీ,కేసీఆర్ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నారు
- కానీ వారు ఏమీ చేయలేరు
కుత్బుల్లాపూర్ విజయభేరి సభకు ఖర్గే
- కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.
- భారీగా హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు
టూరిజం కార్పొరేషన్ ఎండీ సస్పెన్షన్
- తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్‌రావును సస్పెండ్ చేసిన ఈసీ
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంట తిరుమలకు వెళ్లడంపై ఈసీ ఆగ్రహం
వరంగల్ కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ కామెంట్స్
- సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ప్రజల కోసమే
- తెలంగాణ సపంద ఒక కల్వకుంట్ల కుటుంబానికే చేరింది
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ ఇంట్లో వేసుకున్నారు
- అవినీతికి పరాకాష్ట కెసిఆర్
- దళితబంధు పథకంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు
- తెలంగాణలో 20 లక్షలు కుటుంబాల భూమిని గుంజుకున్నారు
- కేసీఆర్ చదువుకున్న కళాశాల కట్టించింది కాంగ్రెస్ పార్టీయే
- ఐటీ క్యాపిటల్ నిర్మించింది కాంగ్రెస్
- మా సర్కారు వస్తే గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలే
- తెలంగాణ మహిళలు బస్‌లో తిరిగితే ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు
- ప్రతి నెలా మహిళల బ్యాంకు ఖాతాలో 2500 రూపాయిలు వేస్తాం
- రైతులకు ఉచిత విద్యుత్
- కుల గణన చేస్తాం
- మా ఉద్యమం బీజేపీ,టీఆర్ఎస్పైనే
- మోదీ ఇక తెలంగాణలో కనిపించరు
కాంగ్రెస్‌లోకి విజయశాంతి
- కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
- కండువా కప్పి ఆహ్వానించిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
- ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసిన రాములమ్మ
పచ్చమీడియాలో రేవంత్‌రెడ్డి ఇంటర్వ్యూలు
- అనుకోకుండా నిజాలు బయటపెట్టేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- మీరు ముఖ్యమంత్రి అయితే కేసులు పెట్టరు కదా అన్న ప్రశ్నకు సూటి సమాధానాలు
- అవినీతి ఉందని ఆరోపించాం, అక్రమాలు జరిగాయని చెప్పాం
- కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెడతామన్న రేవంత్
- చంద్రబాబు అరెస్ట్ కావడం మీకు కలిసొచ్చింది కదా అన్న ప్రశ్నకు అవునన్న రేవంత్
- చంద్రబాబుతో తనకు చాలా రోజులుగా మంచి సాన్నిహిత్యం ఉందన్న రేవంత్
- చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజు పర్సనల్‌గా చాలా బాధకు గురయ్యానన్న రేవంత్
- చంద్రబాబు అరెస్ట్ ఓట్ల పరంగా కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందన్న రేవంత్
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ అంశం సున్నితంగా మారిందన్న రేవంత్
- ఏపీలో చంద్రబాబుతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పోటీలో ఉన్నాడు
- తెలంగాణలో పవన్‌కళ్యాణ్‌కు తక్కువ ఓట్లు వస్తే..
- దాని ప్రభావం ఏపీలో ఆ కూటమిపై పడుతుందన్న రేవంత్
హుజురాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
- మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను మారుస్తుంది
- అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ విధివిధానాలు గమనించాలి
- ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు
- ఎన్నికలు వచ్చాయని ఆగం కావొద్దు
- బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం : కేసీఆర్
- రైతుబంధు రూ.16 వేలు ఇస్తాం
- మూడు గంటల కరెంట్‌తో పొలం పారుతుందా
- ఉన్న కరెంట్‌ను ఊడగొట్టిందే కాంగ్రెస్
- తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది
- బీఆర్ఎస్ను చీల్చాలని ప్రయత్నించింది
అమిత్ షా టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు
- ఈరోజు రాత్రి హైదరాబాద్ రావాల్సిన అమిత్ షా రేపు మధ్యాహ్నం రానున్నారు
- 12 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు
- 12.50కి గద్వాల సభలో పాల్గొంటారు
- సాయంత్రం 6.10 గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా
వికారాబాద్ బొంరాసిపేటలో రేవంత్‌రెడ్డి కామెంట్స్
- బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
- ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు,భూములకు పట్టాల పంపిణీ జరిగింది
- మా హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందింది
- వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేస్తామన్న బీఆరెస్ హామీ నెరవేరలేదు
- కృష్ణా జలాలు తీసుకోస్తామని మోసం చేశారు
- ఇక్కడ తండాలకు రోడ్లు వేయించింది నేను
- పదేళ్లలో ఈ ప్రాంతానికి కేసీఆర్ చేసిందేం లేదు
- ఓటుకు పదివేలు ఇచ్చి బీఆరెస్ గెలవాలనుకుంటోంది
- మనీ, మద్యంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు
- బంగారు తెలంగాణ సంగతేమో కానీ.. భార్య మెడలో బంగారం అమ్మే పరిస్థితి తెలంగాణలో దాపురించింది.
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం.
వరంగల్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్‌లో పాదయాత్ర చేస్తున్నారు
మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కామెంట్స్
- తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో
- ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడింది
- కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది
- ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది
- మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
- జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు
- ఎప్పుడూ ఫామ్ హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతరు
- జనాలు బై బై కేసీఆర్ టాటా కేసీఆర్ అంటరు
- విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారు
- జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారు
కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్..
- ఓటు వేసేటపుడు ఆలోచించి ఓటు వేయాలి
- ఎన్నికలు వచ్చాయని ఆగం కావద్దు
- తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ ఆగం చేసింది
- కాంగ్రెస్ చరిత్ర గురించి కూడా ప్రజలు ఆలోచించాలి
- మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ అంటోంది
- తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంపద పెంచుతున్నాం
- మూడు గంటల కరెంట్‌తో పొలం పారుతుందా
- ఉన్న కరెంట్‌ని ఊడగొట్టింది కాంగ్రెస్సే
- కంటి వెలుగు వంటి ఎన్నో కొత్త స్కీమ్‌లు తీసుకువచ్చా
- కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాం
- మళ్లీ బీఆర్ఎస్దే అధికారం
- ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ఓటు
- కరీంనగర్ అప్పుడెలా ఉందో ఇప్పుడెలా ఉందో ఆలోచించాలి
- ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యమే
తెలంగాణలోనూ కులగణనను జరిపిస్తాం: రాహుల్
►పినపాకలో రాహుల్ శుక్రవారం ఎన్నికల ప్రచారం
►పదేళ్లు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంతం పలికే రోజు వచ్చింది.
►ఎన్ని లక్షల కోట్లను కేసీఆర్ అవినీతి చేశారో.. అంత డబ్బును పేదల అకౌంట్లలో వేస్తాం.
►కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో నేనే స్వయంగా వెళ్లి చూశా.
►కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లను దోచుకున్నారు.
►తెలంగాణలో 24 గంటల కరెంట్ కేవలం కేసీఆర్ ఇంట్లో మాత్రమే వస్తుంది.
► కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారు.
మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు..
►ప్రతీ ఏటా రైతు భరోసా
►రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరానిక రూ.15వేలు
►వ్యవసాయ కూలీలకు రూ.12వేలు
►వరి క్వింటాల్‌కు రూ.500 బోనస్.
►ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
►ఇల్లు లేని వారికి ఇంటి స్థలానికి రూ.5లక్షలు
►ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.
►విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు.
►ప్రతీ మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
►చేయూత పెన్షన్ రూ.4వేలు
►మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల రూ.2500
►రూ.500లకే గ్యాస్ సిలిండర్
►నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడి యాక్ట్.
►ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
►ధరణి పోర్టల్ రద్దు.
►దివ్యాంగులకు ఆరువేల పెన్షన్.
►కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్డీతో విచారణ
►మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు.
►తొలి కేబినెట్లో మెగా డీఎస్సీ
►విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్
►ఖమ్మం, ఆదిలాబాద్ నూతన విశ్వవిద్యాలయాలు
►ధరణి స్థానంలో భూమాత పోర్టల్
►కొత్త రేషన్ కార్డులు జారీ.
►ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేల సాయం
►రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి.
►గ్రూప్-3కి జూన్ 1, 2024
►పోటీ పరీక్షలకు ఫీజు రద్దు.
►గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు జాబ్ క్యాలెండర్
►సీఎం కార్యాలయంలో ప్రతీరోజు ప్రజా దర్బార్
పూర్తి మేనిఫెస్టో కోసం క్లిక్ చేయండి
మాది పీపుల్స్ మేనిఫెస్టో: భట్టి విక్రమార్క
►భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర సంపదను పేదలకు పంచే విధొంగా మేనిఫెస్టో. కౌలు రైతులకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా మేనిఫెస్టో. దళిత, గిరిజనులకు మేలు చేసేలా మేనిఫెస్టో. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయి. ఇది పీపుల్స్ మేనిఫెస్టో. ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు అవసరమైన అన్ని అంశాలు మేనిఫెస్టోలో పెట్టాం.
►ఈ మేనిఫెస్టోనే కాంగ్రెస్‌కు భగవద్గీత, ఖురాన్, బైబిల్.
►సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం
►అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం.
►కేసీఆర్‌కు పదేళ్లు అధికారం ఇచ్చినా, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు.
►నిరుద్యోగ సమస్యలను బీఆర్ఎస్ పరిష్కరించలేదు.
►కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు.
►పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు..
►నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు.
►పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు
►వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది.
►ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు.
►తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోంది
►మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు.
►కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు..
►కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు.
►ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి.
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
►గాంధీభవన్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది.
►మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విడుదల చేశారు.
►టీ కాంగ్రెస్ మేనిఫెస్టో ‘అభయ హస్తం’ పేరిట 42 పేజీలతో ఉంది.
►62 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
►ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి,శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్లో బండి సంజయ్ ప్రచారం..
►చామనపల్లిలో సంజయ్ ఎన్నికల ప్రచారం
►బండి సంజయ్ కామెంట్స్..
►నేను అవినీతికి పాల్పడితే నన్ను స్టార్ క్యాంపెయినర్ ఎందుకు చేస్తారు?
►జాతీయ కార్యదర్శి ఎందుకు చేస్తారు?
►కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎందుకు బరిలో దింపారో గంగుల చెప్పాలి.
►భూకబ్జాలు, కమీషన్లు, గంజాయి వంటి అక్రమదందాలకు కేరాఫైన గంగుల నాపై ఆరోపణలా?
►ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నది ఓ ముసుగు మాత్రమే.
►ఆర్టీసీ ఆస్తులు కొట్టేసిందుకు కేసీఆర్ కుటుంబం కుట్ర చేస్తోంది.
►ఎంఐఎం వాళ్లను రేప్పొద్దున కరీంనగర్ కార్పోరేషన్లో మేయర్ చేస్తానని గంగుల ఒప్పందం కుదుర్చుకున్నారు.
►బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా.. అలాగే కరీంనగర్లోనూ అనూహ్య స్పందన లభిస్తోంది.
రాహుల్ గాంధీ కాదు.. రాంగ్ గాంధీ: మంత్రి హరీష్
►రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీలు అంటూ తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారు
►కర్ణాటకలో ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు
►కర్ణాటకలో ఓటేసిన ప్రజలకు పథకాలు అందటం లేదు
►కర్ణాటక ప్రజలు ఏది అడిగినా ఖజానా ఖాళీ అయ్యింది అని అక్కడ సీఎం చెప్తున్నారు
►ఐదు గ్యారంటీలని చెప్పిన కాంగ్రెస్ ప్రజలకు రాం రాం చెప్పారు
►ఆ గ్యారంటీలకు దిక్కులేదు
►విద్యార్థుల స్కాలర్ షిప్‌లు ఇవ్వటం లేదు
►స్కాలర్ షిప్‌లు ఇవ్వకుండా కోత పెట్టి కార్మికుల పిల్లలను చదువుకు దూరం చేస్తోంది
►తెలంగాణలో కాంగ్రెస్ రంగు రంగుల ప్రపంచం చూపుతోంది
►కర్ణాటక ప్రజా ప్రతినిధులో అసహనం వ్యక్తం అవుతోంది
►అభివృద్ది నిధులు ఇవ్వకపోతే జనాల్లోకి ఎలా వెళ్ళాలని అక్కడి నేతలు అడుగుతున్నారు
►వెలుగుల దీపావళి కావాలా?, కర్ణాటక లాంటి దివాలా కావాలా?
►తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి
►357 మంది కర్ణాటక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
►కానీ, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి
►మేము రైతులం అని చెప్పుకోవడానికి తెలంగాణలో రైతులు గర్వంగా చెప్పుకుంటున్నారు
►గెలిచే దాకా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటారు, ఆ తర్వాత excuse me please అంటారు
►ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి
►కర్ణాటక పరిస్థితి తెలంగాణకు కావాలా?
►ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి
►రాహుల్ గాంధీ రాంగ్ గాంధీగా మారాడు
►కర్ణాటక ఫెయిల్యూర్ మోడల్‌ను రాహుల్ గాంధీ తీసుకొస్తున్నారు
►కర్ణాటక ప్రజల్లగా తెలంగాణ ప్రజలు మోసపోరు.
►చిదంబరం మరోసారి తెలంగాణ ప్రజల మనుసు గాయం చేసేలా మాట్లాడారు
►అమరవీరుల త్యాగాలను కించపరిచేలా చిదంబరం వాఖ్యలు ఉన్నాయి
►కాంగ్రెస్ నాయకులను ప్రజా క్షేత్రంలో నిల్చోబెట్టి అమరుల తల్లులతో కొరడాతో కొట్టించిన తప్పు లేదు
►బేషరతుగా చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
►చిదంబరం తీరు ఎలా ఉందంటే..
►హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన అమెరికా సారీ చెప్పినట్టు ఉంది.
►స్వాతంత్రం పోరాటంలో ఎంతో మందిని కాల్చి చంపిన డయ్యర్ సారీ చెప్పినట్టు ఉంది.
►ఆత్మబలి దానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా మీ పాపం పోదు.
బీఆర్ఎస్లోకి కత్తి కార్తీక..
►కత్తి కార్తీక అధికార బీఆర్ఎస్లో చేరారు.
►తెలంగాణభవన్‌లో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఆమె గులాబీ పార్టీలో చేరిక
►పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హరీష్.
►కత్తి కార్తిక కామెంట్స్..
►నాకు రోషం, కసి ఎక్కువ.
►దుబ్బాకలో కాంగ్రెస్ లేదు.
►అలాంటి దుబ్బాకలో కాంగ్రెస్ జెండా మోసి పార్టీని కాపాడాను.
►కాంగ్రెస్‌కు పట్టిన శని రేవంత్ రెడ్డి.
►ఆడపిల్ల ఉసురు రేవంత్‌కు కచ్చితంగా తాకుతుంది.
►ఆడబిడ్డను కంటతడి పెట్టేలా చేశాడు రేవంత్.
►గౌరవంలేని చోట నేను ఉండలేను.
►అందుకే బీఆర్ఎస్లో చేరాను.
కాంగ్రెస్‌కు కవిత కౌంటర్..
►గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా ???!!
►ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా?
►పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!
►ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జైతెలంగాణ చెప్పకపోవడం దారుణం.
►ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం.
►సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మేకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!
గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా ???!!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 17, 2023
ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా?
పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!
ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జైతెలంగాణ… pic.twitter.com/N4bni4z4qU
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి సత్యవతి రాథోడ్..
►మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు.
►గూడూరు మండలంలోని కొంగర గిద్దె గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌తో కలిసి ప్రచారం.
►మహిళలు మంగళ హారతి పట్టగా హారతిలో డబ్బులు పెట్టిన మంత్రి
►వీడియో ఫుటేజ్ ఆధారంగా విచారణ చేసిన ఎన్నికల అధికారులు.
►మంత్రిపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద 171-E, 171-H ఐపీసీ r/w188 iocసెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన గూడూరు పోలీసులు
తెలంగాణ ఎలక్షన్ కమిషన్‌కు ఈసీఐ కీలక సూచనలు
►రాష్ట్రంలో పోలింగ్, కౌంటింగ్ అంశాలపై ఎస్ఈసీకి పలు సూచనలు చేసిన ఈసీ
►నామినేషన్ల ఘట్టంలో ఆర్వో పనితీరుపై అన్ని రాజకీయ పార్టీల ఫిర్యాదు.
►మొదటి నుంచి తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఈసీ.
►ఈసీఐకి వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీసిన సీఈసీ.
►తెలంగాణలో పలుచోట్ల జరిగిన ఘటనలపై ప్రస్తావించిన ఎలక్షన్ కమిషన్
►చివరి రెండు రోజులు డబ్బు, మద్యంపై ఫోకస్ పెట్టాలి: ECI
►వచ్చే వారంలో తెలంగాణకు మరిన్ని కేంద్ర బలగాలు.
►నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.
►ఎస్పీలు పనితీరు స్పీడప్ చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చిన ఈసీఐ.
రాహుల్‌కు వ్యతిరేకంగా పోస్టులు..
►నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలంగాణకు రానున్నారు.
►తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతమంటూ పోస్టర్లు, బాన్యర్లు.
►శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో వెలసిన బ్యానర్లు.
►బ్యానర్లలో తెలంగాణ అమరుల ఫొటోలు మధ్యలో రాహుల్ ఫొటో.
ఈనెల 18న బీజేపీ మేనిఫెస్టో..
►తెలంగాణకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో ఈనెల 18న విడుదల
►మేనిఫెస్టోను విడుదల చేయనున్న అమిత్ షా.
►ప్రధాని మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ మేనిఫెస్టో.
►ఒక్క ఓటు రెండు పెన్షన్లూ అంటూ ప్రచారం చేయాలని నిర్ణయం
►మరోవైపు, ఈనెల 19న తెలంగాణకు జేపీ నడ్డా రానున్నారు.
►తెలంగాణలో మూడు సభల్లో ప్రసంగించనున్న జేపీ నడ్డా.
►చేవెళ్ల, నారాయణపేట్‌లో బహరంగ సభలకు నడ్డా హాజరు.
నేడు తెలంగాణకు రాహుల్, ఖర్గే
►నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే రానున్నారు.
►తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వీరు పాల్గొననున్నారు.
►నేడు 12 గంటలకు మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొననున్న ఖర్గే.
►ఈరోజు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటన
►పినపాక, నర్సంపేట, వరంగల్ ఈస్ట్‌లో రాహుల్ పర్యటన.
నేడు కరీంనగర్లో కేసీఆర్ పర్యటన
►ఈరోజు కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆశీర్వాద సభలు.
►సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.
►మధ్యాహ్నం 1.30 గంటలకు కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో సభ
►మధ్యాహ్నం 2.30 గంటలకు చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం పత్తికుంటపల్లిలో సభ
►సాయంత్రం 4 గంటలకు జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే సభలకు హాజరుకానున్న కేసీఆర్.