టెక్కలి సభలో సీఎం జగన్‌ పొలిటికల్‌ పంచ్‌లు | Tekkali Public Meeting: CM Jagan Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

టెక్కలి సభలో సీఎం జగన్‌ పొలిటికల్‌ పంచ్‌లు

Apr 25 2024 4:52 PM | Updated on Apr 25 2024 4:55 PM

Tekkali Public Meeting: Cm Jagan Comments On Chandrababu - Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ‘‘మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే. కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలంటూ టెక్కలి బహిరంగ సభ వేదికగా ప్రతిపక్షాల కుట్రలను సీఎం జగన్‌ తిప్పికొట్టారు. అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దోచుకోవడం, పంచుకోవడం వారి అలవాటు. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ధనికులకు, పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచివేశాం. డబుల్‌ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి’’ అని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌..

బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్‌ లాంటి నిజాయితీపరుడు కావాలా?

  • చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను.
  • చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వను
  • ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం
  •  చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదు.
  • పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు
  • విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధం
  • వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాసుపత్రులు సిద్ధం
  • ఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం
  • 600లకు పైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధం
  • మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి.
     

మీ జగన్‌ మార్క్‌.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది

  • మీ జగన్‌ మార్క్‌.. అక్కా చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుంది
  • మీ జగన్‌ మార్క్‌.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది
  • మాట మీద నిలబడే మీ జగన్‌ కావాలా?. మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి
  • 2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?
  • రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు..  చేశాడా?
  • ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు..చేశాడా?
  • ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?
  • ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?
  • అర్హులకు మూడు సెంట్ల ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
  • 10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు..  చేశాడా?
  • సింగ్‌పూర్‌ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?
  • ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?
  • మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది
  • ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట నమ్ముతారా?.
  • ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?
  • ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ అంటూ చంద్రబాబు వస్తున్నాడు


Advertisement
 
Advertisement
Advertisement