మూడో రోజూ దౌర్జన్యకాండ | TDP Goons Stopping YSRCP Leaders To File Nominations | Sakshi
Sakshi News home page

మూడో రోజూ దౌర్జన్యకాండ

Oct 19 2026 4:53 AM | Updated on Oct 19 2026 5:11 AM

TDP Goons Stopping YSRCP Leaders To File Nominations

నామినేషన్‌ వేయడానికి వచ్చిన దర్శి మున్సిపల్‌ వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి మహేష్ పై దాడి చేస్తున్న డీఎస్పీ

చంద్రబాబు డైరెక్షన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే లక్ష్యంగా చెలరేగిపోయిన టీడీపీ గూండాలు

నామినేషన్ల చివరి రోజు సైతం దాడులు.. దౌర్జన్యాలు, అరెస్టులు, అడ్డంకులు 

కడపలో వైఎస్సార్‌సీపీ నేతలపైనే హత్యాయత్నం కేసులు నమోదు  

కడప మేయర్‌ అభ్యర్థి దీప్తికి భద్రత కల్పించాలని కోర్టు చెప్పినా వినిపించుకోని వైనం 

జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఇందిరమ్మకు గన్‌ ఎక్కుపెట్టి బెదిరించిన సీఐ కుళాయప్ప 

పుంగనూరుకు వెళ్లొద్దంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు 

తిరుపతిలో మూడో రోజూ రెచ్చిపోయి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు 

దర్శిలో నమ్మించి మోసగించిన పోలీసులు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జి 

గుత్తిలో పోలీసుల కాళ్లు పట్టుకున్నా నామినేషన్‌ వేయనివ్వని పోలీసులు 

ఆళ్లగడ్డలో పలువురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కిడ్నాప్‌  

పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, ఏలూరు, విశాఖ, అనంతపురం జిల్లాల్లోనూ నేతల హౌస్‌ అరెస్ట్‌లు

సాక్షి, అమరావతి: హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అడ్డగింపులు, అరెస్టులతో మూడవ రోజు నామినేషన్లను అడ్డుకునేందుకు రాక్షస హింస కొనసాగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే లక్ష్యంగా గూండా రాజ్యంలో దౌర్జన్యపర్వం అడ్డు అదుపు లేకుండా సాగింది. గవర్నమెంట్‌ స్పాన్సర్డ్‌ గూండాయిజానికి పోలీసుల అండదండలు తోడవ్వడంతో అనేక ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేయలేని పరిస్థితి కల్పించారు. నామినేషన్లు చించి వేయడం, నామినేషన్‌ వేయడానికి వచ్చిన వారిపై దాడులు చేయడం ద్వారా రౌడీ మూకలు తెగబడ్డాయి. 

బాధితులైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపైనే ఎదురు కేసులు పెట్టడం, వారి కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్లకు పిలవటం, వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్టులు చేయడం వంటి ఘటనలతో తీవ్ర భయోత్పోతాన్ని సృష్టించారు. మున్సిపల్‌ ఎన్నికలకు ఆదివారం నామినేషన్లకు తుది గడువు కావడంతో వైఎస్సార్‌ కడప, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, పల్నాడు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఏలూరు, విశాఖపట్నం, అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసులు, పచ్చ మూకలు ఏకమై వైఎస్సార్‌సీపీ శ్రేణులు నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్య పర్వాన్ని కొనసాగించారు.  

జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఇందిరను నామినేషన్‌ వేయకుండా అడ్డుకుంటున్న పోలీసులు

అడుగడుగునా హింసా రాజకీయం 
⇒ వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, దువ్వూరు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వారి అనుచరులపై పచ్చ మూకలు దాడులకు తెగబడ్డాయి. కోర్టు ఆదేశించినా∙కడప మేయర్‌ అభ్యర్థి బండి దీప్తికి పోలీసులు భద్రత కల్పించలేదు. పులివెందుల అప్సర సర్కిల్‌ వద్ద టీడీపీ నేత బీటెక్‌ రవి అనుచరులు కర్రలతో హల్‌చల్‌ చేశారు. ప్రొద్దుటూరులో 19 మంది ౖవైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. మొదటి వార్డు అభ్యర్థి సుమతి, 28వ వార్డు అభ్యర్థి ఫాతిమా నుంచి నామినేషన్ల పత్రాలను లాక్కున్నారు. బద్వేల్‌లో దౌర్జన్య పర్వాన్ని కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపై ఎస్‌ఐ దాడి చేశారు.  

⇒ జమ్మలమడుగు మున్సిపల్‌ వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి బయలుదేరిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి పొన్నపురెడ్డి ఇందిరమ్మను పోలీసులు అడ్డుకున్నారు. సీఐ కుళాయప్ప గన్‌ చూపిస్తూ ఆమెను బెదిరించారు. కౌన్సిలర్‌ అభ్యర్థులెవరినీ నామినేషన్లు వేయనివ్వలేదు.  

నామినేషన్‌ వేయించమంటూ తహసీల్దార్‌ కాళ్లపై పడి వేడుకుంటున్న దర్శి అభ్యర్థులు

⇒ తిరుపతిలో వందలాది మంది రౌడీ మూకలు తిష్టవేసి భయభ్రాంతులు సృష్టించారు. వైఎస్సార్‌సీపీ, కమ్యూనిస్టు పార్టీ, స్వతంత్ర  అభ్యర్థుల నామినేషన్లను సైతం చింపేశారు. తిరుపతి తొమ్మిదో వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌రెడ్డిపై దాడి చేసి నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు.   36వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థి ఇమామ్‌ సాహెబ్‌పై ఎల్లో గ్యాంగ్‌ దాడిచేసి గాయపరిచింది. ఇలా పలువురిని అడ్డుకున్నారు. మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌ పచ్చ మూకల అడ్డంకులను ఎదిరించి నామినేషన్‌ దాఖలు చేశారు.   

వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో నామినేషన్‌ వేసేందుకు వస్తున్న అభ్యర్థులను అడ్డుకుంటున్న పోలీసులు

⇒ పుత్తూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి జయప్రకాష్‌ నామినేషన్‌ పత్రాలను ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ కారు డ్రైవర్‌ ఉదయ్‌ లాక్కొని చించివేశారు. నగరిలోని కశింమిట్ట నామినేషన్ల కేంద్రం వద్ద ఇటీవల టీడీపీలో చేరిన కేజే.కుమార్, అతని కుమారులు రౌడీయిజం చేశారు. 4వ వార్డు వైఎస్సార్‌సీపీ అ«భ్యర్థి తామరసెలి్వ, 36వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంద్రయ్య నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేశారు.   

⇒ చిత్తూరు జిల్లా యాదమరి మండలం గొందివాళ్లవూరులో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి ఆసక్తి చూపుతున్న దాముపై పచ్చ రౌడీలు విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను పచ్చ గూండాలు చించివేశారు. ఓ అభ్యర్థి ఎస్‌ఐ కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. అనంతపురంలోని ఆసుపత్రి పాలెంలో నివాసం ఉంటున్న 24వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి కొట్ల షఫీ ఇంటిపై దాడి చేసి ఫరీ్నచర్‌ ధ్వంసం చేశారు. ఒకటో వార్డు అభ్యర్థి మహమ్మద్‌ జాఫర్‌ అలియాస్‌ చిట్టీ అన్న మాబాషాను ఎత్తుకెళ్లారు. మహిళా అభ్యర్థులను, వారిని బలపరిచిన వారిని బెదిరించారు.  

⇒ తిరుపతి జిల్లా పుంగనూరులో మొదటి వార్డు నుంచి నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లిన ఎస్సీ మహిళా అభ్యర్థి కమలమ్మ నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నామినేషన్లు వేస్తున్న వారిని అడ్డుకున్నారు. పుంగనూరుకు వెళ్లొద్దంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

ఒంగోలులో నామినేషన్లు వేసేందుకు అనుమతించాలని ఆర్డీవోను వేడుకుంటున్న అభ్యర్థులు

⇒  పల్నాడు జిల్లాలో పలువురు అభ్యర్థులను ఇళ్ల లోంచి బయటకు రానివ్వలేదు. గురజాల, పిడుగురాళ్లలో నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినుకొండ బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. 
దర్శిలో కొనసాగిన రౌడీయిజం  

ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీ ఝళిపిస్తున్న పోలీసు

⇒  ప్రకాశం జిల్లా దర్శిలో నామినేషన్లు వేయిస్తామని చెప్పి, చివరి నిమిషంలో పోలీసులు అడ్డుకున్నారు. చైర్మన్‌ అభ్యరి్థతోపాటు 25 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో పలుమార్లు పోలీసులు లాఠీచార్జి చేశారు. స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని ఆదివారం గృహ నిర్బంధం చేశారు. దర్శి మండలంలోని బండి వెలిగండ్ల గ్రామంలో సుమారు 30 మంది పచ్చగూండాలు గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నేతల నివాసాలే టార్గెట్‌గా నివాసాల్లో ఉన్న బైక్‌లు, ట్రాక్టర్‌లను ధ్వంసం చేశారు. కత్తులు, రాడ్‌లతో గ్రామంలో హల్‌ చల్‌ చేశారు. గాయపడ్డ వారిని 108లో దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

⇒  పోలీస్‌ భద్రతతో నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలని పిడుగురాళ్ల వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి షేక్‌ అబ్దుల్లా కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కోర్టు ఐజీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే నామినేషన్‌ స్వీకరించకుండా కాల యాపన చేసి.. చివరకు గడువు ముగిసిందని చెప్పారు.   

⇒ మార్కాపురం జిల్లా కనిగిరిలో పచ్చ మూక పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై తీవ్ర దౌర్జన్యానికి తెగబడింది. నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించేశారు. వైఎస్సార్‌ సీపీ 32వ వార్డు అభ్యర్థి లక్ష్మి నామినేషన్‌ పత్రాలను డీఎస్పీ, సీఐ, ఎస్సై లాక్కొని చింపేశారు. వైఎస్సార్‌ సీపీ 18వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి ఎస్‌కే సమీరా, ఆమె భర్తపై, బంధువుపై పచ్చ మూక తీవ్రంగా దాడి చేసింది. పలువురి నామినేషన్లు యథేచ్ఛగా లాక్కొన్నారు.  

⇒ విజయవాడ నగర మేయర్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌కు ఆంక్షలు విధించిన పోలీసులు.. కూటమి పార్టీ అభ్యరి్థకి ఎటువంటి ఆంక్షలు లేకుండానే స్వేచ్ఛగా వదిలేశారు.  

⇒ అనంతపురం జిల్లాలోనూ నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వివాదం తలెత్తింది. వైఎస్సార్‌సీపీ అభ్యరి్థని నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు. గుంటూరు పశి్చమ నియోజకవర్గంలోని 26వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థి నామినేషన్‌ను లాలాపేట పోలీసులు లాక్కున్నారు.   

కిడ్నాప్‌కు గురైన కుటుంబాల సభ్యులతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి

⇒ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు అభ్యర్థులను ఆదివారం రాత్రి కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో కలిసి నాలుగు రోడ్ల కూడలిలో నిరసనకు దిగారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement