TDP Workers Attacked On YSRCP MLA Bolla Brahmanaidu At Vinukonda - Sakshi
Sakshi News home page

‘ప్లాన్‌ ప్రకారమే నాపై దాడి చేశారు.. ఎవర్ని వదిలిపెట్టం: బ్రహ్మానాయుడు వార్నింగ్‌

Jul 27 2023 1:10 PM | Updated on Jul 27 2023 2:55 PM

TDP workers Attacked YSRCP MLA Bolla Brahmanaidu At Vinukonda - Sakshi

సాక్షి, గుంటూరు: వినుకొండలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్‌కు గాయాలయ్యాయి.

ఈ సంద్బరంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని టీడీపీ శ్రేణులు అరగంటపాటు అడ్డుకున్నారు. వారి రాళ్ల దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు దాడికి నిరసనగా వైఎ‍స్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఈ క్రమంలో వినుకొండలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. 

అనంతరం.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. నేను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే దాడికి దిగారు. టీడీపీ నేతలు నా కారుపై రాళ్ల దాడి చేశారు. కావాలనే వారు ప్లాన్‌ ప్రకారం నాపై దాడి చేశారు. నాపై భౌతికంగా దాడి చేయాలని ప్లాన్‌ చేశారు. టీడీపీ కుట్రలను తిప్పి కొడతాం. ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాను. రెండు రోజుల క్రితం నా డెయిరీ ఫామ్‌ను ధ్వంసం చేశారు. ఇక్కడ జీవీ ఆంజనేయులు వంటి చెత్త నేతలు ఉన్నారు. ప్రజల తిరుగబాటుతో తోక ముడిచారు. జీవీ ఆంజనేయులుకు ప్రజాభిమానం లేదు. గ్రామాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలది నీచమైన సంస​ృతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 

ఇది కూడా చదవండి: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement