టీడీపీలో రాజీనామాల పర్వం.. | TDP Senior Leaders Are Resigning In Vizianagaram District | Sakshi
Sakshi News home page

టీడీపీలో రాజీనామాల పర్వం..

Jan 31 2021 10:42 AM | Updated on Jan 31 2021 6:29 PM

TDP Senior Leaders Are Resigning In Vizianagaram District - Sakshi

గజపతినగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తున్న మాజీ మంత్రి పడాల అరుణ

టీడీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలోని కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో కార్యకర్తలు, నాయకుల్లో నైరాశ్యం ఆవహించింది. ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన పార్టీలో కొనసాగాలా.. వద్దా అన్న సందిగ్ధం నెలకుంది.  

సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రజాదరణ కోల్పోయిన పార్టీ ప్రతిష్ట క్రమక్రమంగా క్షీణిస్తోంది. అవసరం తీరిన తరువాత తన, మన అనే తేడా లేకుండా... సీనియర్లనే కనీస గౌరవం లేకుండా పూచిక పుల్లను వాడిప డేసినట్లు పక్కన పడేయడం ఆ పార్టీ అధినేతల సంప్రదాయం. దశాబ్దాలుగా అక్కడ అదే జరుగుతోంది. దీనిని జీర్ణీంచుకోలేని కొందరు సీనియర్లు పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా.. 

గజపతినగరంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 1985లో రాజకీయ రంగ ప్రవేశం చేశానని, ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశానని, కానీ వాటిని ఈ రోజు తెలుగు దేశం పార్టీ కనీసం గుర్తించక పోవడం వల్లనే రాజీనామా చేస్తున్నానని అరుణ వివరించారు. మూడు దశాబ్దాలుగా ఆమెకు టీడీపీతో అనుబంధం ఉంది. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ నేతల బరితెగింపు..

1987లో బొండపల్లి మండల అధ్యక్షురాలిగా, 1989, 1994లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో మంత్రి పదవి చేపట్టారు. 1999 నుంచి చాలా పదవులు నిర్వహించారు. అంతటి క్రియాశీలకంగా ఉండే పడాల అరుణకు 2013 నుంచి పారీ్టలో ప్రాధాన్యం తగ్గడం మొదలైంది. ‘‘పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన నన్ను రోజురోజుకు గుర్తింపు లేనివిధంగా చేశారు’’... అంటూ ఆమె విలేకరుల ఎదుట కన్నీటిపర్యంతమవ్వడం టీడీపీలో సీనియర్లు, పారీ్టకి కట్టుబడి ఉన్నవారి పరిస్థితికి అద్ధం పట్టింది. 

అందిరిదీ అదే వేదన...  
ఒక్క అరుణకే ఈ పరిస్థితి కాదు. జిల్లాలో అనేక మంది టీడీపీ నాయకులు, సీనియర్ల పరిస్థితి కూడా ఇదే. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావును కూడా ఇదే విధంగా పార్టీని వీడేలా చేశారు. ఆయన కూడా చాలా కాలం పాటు టీడీపీకి సేవచేసి, చివరికి తనకు పారీ్టలో కనీస గుర్తింపు లేదని మదనపడి రాజీనామా చేసి ఇటీవలే బయటకు వచ్చేశారు. ఆ తరువాత మరో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తిరుగుబావుటా ఎగురవేశారు. ఆమెకు ఇంకో ఎమ్మెలే కె.ఎ.నాయుడు జతకలిశారు. విజయనగరం  పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష పదవిని జూనియర్‌ అయిన కిమిడి నాగార్జునకు ఇవ్వడాన్ని నిరసిస్తూ గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ. నాయుడు తానే వేరుగా విజయనగరం పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేశారు.  

ఆయన బాటలోనే విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కొందరు నేతలతో కలిసి ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకుని విజయనగరం పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు. అప్పటికే కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు బంగ్లాలో నగరపార్టీ కార్యాలయం నడుస్తోంది. ఈ పంచాయితీ టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. మీసాల గీతకు లభించాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కలేదన్న వాదన వినిపిస్తోంది. పోనీ అశోక్‌ పెద్దరికమైనా నిలిచిందా అంటే అదీ లేదు.

అశోక్‌మీద అమిత గౌరవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పార్టీ కార్యాలయం విషయంలో అశోక్‌ పెద్దరికాన్ని స్థానిక నేతలు ధిక్కరిస్తున్నా ఏమీ చేయలేదు. ఆయన గౌరవాన్ని కాపాడలేదు. ఈ విషయంలో సీనియర్‌గా అశోక్‌ తన అనుచరుల వద్ద వాపో యారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడైన మహంతి చిన్నంనాయుడు పార్టీ కార్యకలాపాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. ఇలా సీనియర్లకు, ముఖ్య నేతలకు టీడీపీలో విలువ ఉండకపోవడంతో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. కొందరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement