నారా వారి ఆస్థానిక గూండాలు చెలరేగిపోతున్నారు. వక్రమార్గంలో ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు సర్కారు పన్నిన కుయుక్తులలో పావులుగా మారి స్థానిక ఎన్నికలను రణరంగంగా మారుస్తున్నారు. విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష అభ్యర్థులపై మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం చేస్తున్నారు. ఖా'కీలూ బొమ్మల్లా' మారి పచ్చమూకలకు సహకరిస్తున్నారు.









