ఒక్క నామినేషన్‌ వేయనిస్తే ఒట్టు..! | TDP Rowdies Attack On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

ఒక్క నామినేషన్‌ వేయనిస్తే ఒట్టు..!

Oct 23 2026 1:01 PM | Updated on Oct 23 2026 1:15 PM

TDP Rowdies Attack On YSRCP Leaders

నామినేషన్‌ వేయనీయకపోవడంతో నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు

ప్రకాశం జిల్లా: ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచక పర్వం కొనసాగుతోంది. నామినేషన్ల రెండో రోజూ కూడా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. దీంతో గురువారం వైఎస్సార్‌ సీపీ నుంచి ఒక్కరూ కూడా నామినేషన్‌ వేయలేకపోయారు. పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ నేతలు, పోలీసులు, అధికారు కుమ్మక్కై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండ ఆనిలువరించారు. తొలుత ఉదయం 11:30 గంటల లోపే టీడీపీ అభ్యర్థులు 16 నామినేషన్లు వేశారు. ఆ తర్వాత  టీడీపీకి చెందిన కొందరు డమ్మీ అభ్యర్థులు, మరికొందరు సానుభూతిపరులు ఖాళీ పత్రాలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అడ్డుగా నిలిచారు. 

దీంతో ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తిండి, నీరు లేకుండా గంటల తరబడి క్యూలోనే వేచి ఉండాల్సి వచ్చిందా. అయినా చివరికి నామినేషన్‌ వేయకుండానే వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఎస్సై సుదర్శన్‌ను కలిసి, నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులను అనుమతించాలని కోరినట్లు తెలిపారు. అయినా పోలీసులు స్పందించలేదని, లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మరోవైపు టీడీపీ నాయకులు జెండాలు ధరించి కార్లలో నామినేషన్‌ కేంద్రాల వద్దకు స్వేచ్ఛగా వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విమర్శించారు.

 నామినేషన్ల ప్రక్రియతో సంబంధం లేని వ్యక్తులు గంటల తరబడి క్యూలో ఎందుకు ఉన్నారని, వారిని కేంద్రంలోకి ఎలా అనుమతిస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను తనిఖీల పేరుతో అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. రోజంతా నిలబడి ఉన్నా పోలీసులు నామినేషన్‌ వేసేందుకు అవకాశం ఇవ్వలేదని, ఇదేనా ప్రజాస్వామ్యమంటూ వారు మండిపడ్డారు. అనంతరం నామినేషన్ల పత్రాలతో అభ్యర్థులు కేంద్రం నుంచి వెనుదిరిగి ఆర్‌అండ్‌బీ రహదారిపై నిరసనకు దిగారు.  తమకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: సేవ్‌ వైజాగ్‌తో హోరెత్తిన ప్రచారం


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement