నామినేషన్‌ కేంద్రం వద్ద కీచక పర్వం | TDP Goons Attack on YSRCP Women Candidates | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కేంద్రం వద్ద కీచక పర్వం

Oct 23 2026 12:08 PM | Updated on Oct 23 2026 12:45 PM

TDP Goons Attack on YSRCP Women Candidates

వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థి నాగరత్నమ్మపై దాడిచేసి నామినేషన్‌ లాక్కోని వెళ్తున్న టీడీపీ మూక

గంగాధర నెల్లూరు:  గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో నామినేషన్‌ రెండో రోజు గురువారం నామినేషన్‌ వేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులపై టీడీపీ నాయకులు దాడి చేసి, గాజులు పగులగొట్టి చీరలాగి, నామినేషన్‌ పత్రాలు లాక్కున్నారు. బాలగంగానపల్లి పంచాయతీకి చెందిన మోహన, వింజం పంచాయతీకి చెందిన నాగరత్నమ్మ గురువారం నామినేషన్‌ వేయడానికి మండల కేంద్రానికి చేరుకున్నారు. 

ఆర్వో కార్యాలయం ఎదుట వందలాదిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, తమిళనాడుకు చెందిన రౌడీలు ఒక్కసారిగా మహిళలపై పడి దాడిచేసి, గాజులు పగులగొట్టి నామినేషన్‌ పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించారు. పోలీసుల రంగ ప్రవేశంతో అక్కడ నుంచి మహిళ పరుగెత్తుకుని ఆర్వో కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు.

నగరి అభ్యర్థులకు అవమానం
జెడ్పీటీసీ నామినేషన్‌లు దాఖలు చేసేందుకు నగరి నుంచి వచ్చిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు రవికుమార్, గురుమూర్తికి  అవమానం ఎదురైంది. జెడ్పీటీసీ నామినేషన్‌ కేంద్రం సమీపంలో ఎంఎస్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద టీడీపీ గుండాలు కాపుకాచి భయాందోళనలు సృష్టించారు. ఆ అభ్యర్థుల దుస్తులు తొలగించి నామినేషన్‌ పత్రాలు ఉన్నాయా అని తనిఖీ చేశారు. అక్కడే ఈ ఘటనను చూస్తున్న పోలీసులు ఏ మాత్రం స్పందించకుండా ప్రేక్షకపాత్ర పోషించారు. చివరికి ఎన్నికల అధికారులు సహాయం కోరాల్సిన దుస్థితి ఏర్పడింది.  

ఇదీ చదవండి: ‘నామినేషన్‌ ఎలా వేస్తావో.. చూస్తా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement