సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో టీడీపీ గూండాల బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు చించివేశారు. గన్‌మన్‌ను వెంటపెట్టుకుని వెళ్లిన టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి.. నామినేషన్ సెంటర్‌లో హల్‌చల్ చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు నామినేషన్లు చించేశారు. రక్షణ కల్పిస్తామంటూ చెప్పిన పోలీసులు చేతులెత్తేశారు.
‘‘పుత్తా నరసింహారెడ్డిని నామినేషన్ సెంటర్‌లోకి ఎలా అనుమతించారు?. గన్‌మెన్‌తో సహా లోపలికి వెళ్తుంటే.. పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు. వైఎస్సార్‌సీపీ ేతలను అడ్డుకుంటారు కానీ.. పుత్తా నరసింహారెడ్డిని అడ్డుకోరా?. కడప కలెక్టర్, ఎస్పీ దీనిపై ఏం సమాధానం చెబుతారు?’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


