ఏపీ రావణ కాష్ఠం.. బాబు సర్కార్‌ అష్ట కుట్రలు! | Ys Jagan Comments On Chandrababu And SEC | Sakshi
Sakshi News home page

ఏపీ రావణ కాష్ఠం.. బాబు సర్కార్‌ అష్ట కుట్రలు!

Oct 23 2026 1:38 PM | Updated on Oct 23 2026 2:35 PM

Ys Jagan Comments On Chandrababu And SEC

సాక్షి, తాడేపల్లి: ఏపీని రావణ కాష్ఠంగా మార్చేలా అష్టకుట్రలు పన్నారంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కుట్రలకు పితామహుడు చంద్రబాబేనని.. ఫోర్జరీ, మోసాలు, కుట్రలు తారాస్థాయికి చేరాయన్నారు. చంద్రబాబు, ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో కుట్రలు జరుగుతున్నాయంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నామినేషన్ల ప్రక్రియలో ఎనిమిది కుట్రలు:
👉పోటీ చేయాలనుకునే అభ్యర్థులను పోలీసుల పేరుతో పిలిపించి బెదిరించడం, బైండోవర్‌ చేయడం, ముందస్తు అరెస్టులకు పాల్పడడం అభ్యర్థులకు 👉👉సహకరించే పార్టీ నాయకులను గృహనిర్బంధం చేసి నామినేషన్లకు వెళ్లకుండా అడ్డుకోవడం.
👉నామినేషన్‌ కేంద్రాల వద్ద అధికార పార్టీ శ్రేణులను మోహరించి ప్రతిపక్ష అభ్యర్థులను లోపలికి వెళ్లనివ్వకపోవడం.
👉నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేయడం, అధికారుల ఎదుటే దాడులకు పాల్పడడం.
👉దాడులను అడ్డుకోకుండా, బాధితులైన వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులనే కేంద్రాల నుంచి బయటకు పంపించడం.
👉దాడులకు గురైన అభ్యర్థులు, వారికి సహకరించిన నాయకులపైనే కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేయడం
👉స్క్రూటినీ పేరుతో నామినేషన్లు తిరస్కరించడం, అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్లు చూపించడం
👉బెదిరింపులు, ఒత్తిళ్లతో అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం.

‘‘ప్రజలకు చేసిన మంచిని చూపించి ఓట్లు అడగాల్సిన చంద్రబాబు, ఎన్నికల్లో పోటీనే లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేసి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చి ఎన్నికలకు వెళ్లింది. గత ఎన్నికల్లో ప్రజలకు చేసిన పనుల ప్రోగ్రెస్‌ రిపోర్టు చూపించి 86 శాతం స్థానాల్లో విజయం సాధించాం. నేడు సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీల అమలుపై ప్రజలు చంద్రబాబును నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఎన్నికలనే స్వేచ్ఛగా జరగనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఇదీ చదవండి: బాబు కుట్రలు.. సాక్ష్యాలతో బయటపెట్టిన వైఎస్‌ జగన్

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement