సాక్షి, తాడేపల్లి: ‘‘తొండి, అన్యాయం, దౌర్జన్యమే వీళ్ల మార్క్‌రాజకీయం.. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా ఎలాంటి మార్పులేదు’ అంటూ చంద్రబాబు సర్కార్ అరాచకాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రావణ కాష్ఠంగా మార్చేలా అష్టకుట్రలు పన్నారంటూ ధ్వజమెత్తారు.
‘‘నామినేషన్లు వేయకముందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై బెదిరింపులకు దిగారు. బెండోవర్ పేరిట పిలిచి బెదిరింపులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. నామినేషన్ కేంద్రాలను స్వాధీనం చేసుకుని మా అభ్యర్థులను అడ్డుకున్నారు. చంద్రబాబుకు పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. వాళ్లను బాధ్యతల నుంచి తప్పించకుండా నిష్ప్రక్షపాతంగా ఎన్నికలు ఎలా జరుగుతాయి?. పరిస్థితుల్లో మార్పులు ఎలా వస్తాయి?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.
‘‘పోలింగ్ కేంద్రాల రిగ్గింగ్ నుంచి నామినేషన్ కేంద్రాల రిగ్గింగ్‌కు దిగజారారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు తెరతీశారు. పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చించేశారు. అధికారులు దాడులు చేస్తున్నా అడ్డుకోలేదు. బాధిత అభ్యర్థులనే నామినేషన్ సెంటర్ నుంచి బయటకు పంపారు. టీడీపీ మూకలు మాత్రం వందలమంది గుమిగూడుతున్నారు. దాడికి గురైన వైఎస్సార్‌ీపీ నాయకులపైనే కేసులు పెట్టారు. ఇంటికే పరిమితం చేశారు.. లేదా జైళ్లకు పంపారు. వ్యవస్థలపై ప్రజలకు అసహ్యం పుట్టేలా చేస్తున్నారు
..స్క్రూటినీ సమయంలో అభ్యర్థులను అడ్డుకున్నారు. అభ్యర్థి లేకుండానే సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్లు విత్ డ్రా చేశారు. నంద్యాల 51వ వార్డులో అభ్యర్థి నాగమణి సంతకం ఫోర్జరీ చేశారు. స్థానిక ఎన్నికల్లో తీవ్రమైన దాడులకు గురైంది మహిళలే. మహిళలు నామినేషన్లు వేయడానికి వస్తే జుట్టు పట్టుకున్నారు. మహిళల చీరలు లాగేసి. దాడులకు తెగబడ్డారు. చంద్రబాబు మనిషేనా?. చంద్రబాబు అండ్ గ్యాంగ్ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారు
..గోరంట్లలో మంత్రి సవిత అనుచరులు ఎన్నికల అధికారుల గదిలోకి చొరబడ్డారు. అధికారు చేతుల్లో నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేశారు. చిత్తూరు జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎంపై దాడి చేశారు. నారాయణస్వామి కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ధర్మవరంలో బోయ వాల్మీకి వర్గానికి మహిళపై దాడి చేశారు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నరేంద్ర చౌదరిపై ఆర్వో సమక్షంలో దాడి చేశారు

కడపలో ఎంపీ అవినాష్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్లు పోలీసుల అరెస్ట్ చేశారు. రైల్వే కోడూరులో మహిళపై ఎమ్మెల్యే శ్రీధర్ అనుచరులు దాడి చేశారు. ఆడవాళ్లంటే కనీస గౌరవం లేదు.. మనుషులా రాక్షసులా?. అనుపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సీఐ కాళ్లు పట్టి మరీ వేడుకుంది. మా హయాంలో ఒక్కటైనా ఇలాంటి ఘటన జరిగిందా?. తొండి, అన్యాయం, దౌర్జన్యమే వీళ్ల మార్క్‌రాజకీయం. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా ఎలాంటి మార్పులేదు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


