శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతల దాడి | Tdp Leaders Attack Ysrcp Leaders In Srikakulam District | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతల దాడి

Dec 15 2024 9:23 PM | Updated on Dec 15 2024 9:24 PM

Tdp Leaders Attack Ysrcp Leaders In Srikakulam District

రణస్థలం మండలం ఎన్టీఆర్‌పురంలో టీడీపీ నేతలు బరితెగించారు.

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రణస్థలం మండలం ఎన్టీఆర్‌పురంలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు.

గురయ్యపేట బీచ్‌కి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు కొమరకొమర రామును అడ్డగించి టీడీపీ నేతలు ముకుమ్మడిగా దాడి చేశారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీపై సైతం రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ ఉప్పాడ అప్పన్న, మత్సకార సోసైటీ ప్రెసిడెంట్ కొమర అప్పన్న, కొమర రాములు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement