చంద్రబాబు తప్పుకుంటేనే మంచిదా వర్మ? | SVSN Varma Wants TDP Leadership Change Here Is The Real Reason | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇక తప్పుకుంటేనే మంచిదా వర్మ?

Apr 9 2025 2:27 PM | Updated on Apr 9 2025 2:27 PM

SVSN Varma Wants TDP Leadership Change Here Is The Real Reason

కాకినాడ, సాక్షి: అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయాయి. చేసిన త్యాగానికి ఒక పదవీ దక్కలేదు. రాజకీయంగా తన నియోజకవర్గంలోనే ప్రాధాన్యం దక్కడం లేదు. పైగా మిత్రపక్ష పార్టీ.. ఆ పార్టీ తరఫున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్నారాయన. ఈ వ్యవహారాలకు చెక్‌ పెట్టేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను ప్రమోట్‌ చేసే బాధ్యతలను ఎత్తుకున్నారు. 

టీడీపీ అధినాయకత్వ మార్పుపై వర్మ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ‘‘నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వల్లే టీడీపీ అధికారంలోకి రాగలిగింది. కాబట్టి టీడీపీకి లోకేష్‌ నాయకత్వం అవసరం. పార్టీ సారధిగా లోకేష్‌ను నియమించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి. పార్టీకి 2047 ప్రణాళిక కావాలి’’ అని అన్నారాయన. అయితే వర్మ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబును తప్పుకోమని చెప్పడమేనన్న విశ్లేషణ నడుస్తోంది. 

కూటమి పార్టీలో టీడీపీ జనసేన అధినేతల మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ, లోకేష్‌తోనే పవన్‌కు గ్యాప్‌ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిందటి ఏడాది ఎన్నికల సమయంలో పొత్తు కుదరడం దగ్గరి నుంచి.. లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలనే ప్రచారం దాకా నడిచిన పరిణామాలు ఎంత హాట్‌ హాట్‌గా సాగాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వల్ల కాకపోవడంతో పవన్‌ పార్టీ డామినేషన్‌కు చెక్‌ పెట్టేందుకే వర్మ లోకేష్‌ జపం మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement