- పెద్దిరెడ్డిపై అవాకులు చవాకులు
- అటవీ భూములు అంటూ ఆధారాల్లేని ఆరోపణలు
- దమ్ముంటే తేల్చాలంటూ మిథున్ రెడ్డి సవాల్
సినిమా స్లో అయినపుడు.. కాస్త సాగదీస్తున్నట్లు.. ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నట్లు ఉండగానే రిలీఫ్ కోసం.. మళ్ళీ జోష్ పెంచడానికి ఒక ఐటం సాంగ్ వస్తుంది.. అప్పట్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని, డిస్కోశాంతి, సిల్క్ స్మిత వంటివాళ్ళు ఆ స్తబ్దతను.. నిరాసక్తతను పోగొట్టి.. మళ్ళీ జనాలను ఉత్తేజితులను చేసేవాళ్ళు. అచ్చం అదే పాత్ర నేడు పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. రాజకీయంగా తన ఇమేజి డౌన్ అవుతున్నదని అనిపించినపుడు.. తనను అటు లోకేష్, చంద్రబాబు సైడ్ ట్రాక్ చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుని నడిపిస్తున్నారనిపించినపుడు.. గతంలో తాను చేసిన ఆరోపణలు.. కామెంట్లు.. అబద్ధపు హామీలు సోషల్మీడియాలో మళ్ళీ ప్రత్యక్షమై తనను వెక్కిరిస్తున్నపుడు ప్రజలకు సమాధానం చెప్పడానికా అన్నట్లుగా మళ్ళీ జుయ్ అంటూ పొలిటికల్ స్క్రీన్ మీదకు.. మీడియాలోకి వస్తూంటాలు.. ఏదోటి మాట్లాడి తన క్యాడర్లో జోష్ నింపే సర్కస్ ఫీట్లు చేసి మళ్ళీ కొన్నాళ్ళు సినిమా షూటింగులకు వెళ్ళిపోతారు.
మొన్న ప్రత్యేక విమానం.. ప్రత్యేక హెలీకాఫ్టర్లో చిత్తూరు అడవులకు వెళ్లి కాసేపు ఎర్ర చందనం పరిశీలనపేరిట హడావుడి చేసి వచ్చారు. ... తరచూ ప్రత్యేకవిమానాల్లో షికార్లు చేస్తున్నారు .. ప్రభుత్వ సొమ్మును విలాసాలకు తగలేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ హోరెత్తింది. దీంతో ఇక వాటికి సమాధానం చెప్పుకోలేక సరికొత్త కాన్సెప్ట్ ను బయటకు తీశారు పవన్.
హెలీకాఫ్టర్లో అలా షికార్లు చేస్తూ స్టయిల్ గా వీడియోలు తీశారు.. అందులో భాగంగా చిత్తూరుజిల్లా మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి 76. 74 ఎకరాల భూములు కబ్జా చేసారంటూ వీడియో విడుదల చేశారు. దాంతోబాటు వాటికి స్వాధీనం చేసుకుంటామని కూడా ప్రకటన చేసారు. వాస్తవానికి గతంలో గుంటూరు జిల్లాలో వైయస్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో కూడా ఇలాగే ప్రభుత్వం భూమి కలిసి ఉందంటూ ఫోటోలు తీసిన పవన్ దాన్ని నిగ్గుతేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తీరా చూస్తే అవన్నీ రైతుల వద్ద అప్పుడెప్పుడో కొనుక్కున్న జిరాయితీ భూములు అని తేలడంతో పవన్ కళ్ళు తేలేసారు.
దమ్ముంటే నిరూపించి తీసుకోండి పవన్ : మిథున్ రెడ్డి ఛాలెంజ్
ఇప్పుడు కూడా పవన్ వీడియోలు చూసి ఎంపీ మిథున్ రెడ్డి ట్విట్టర్లో ఛాలెంజ్ చేసారు.. అవి మీ చంద్రబాబు అధికారంలో ఇరవయ్యేళ్ళ క్రితం కొన్న భూములు. అప్పుడు మేము అధికారంలో లేము.. మీకు దమ్ముంటే రికార్డులతో సహా మేము చేస్తున్న సవాల్ స్వీకరించండి .. లేదా ఊరుకోండి అన్నట్లుగా సవాల్ చేసారు. నోటికొచ్చిన ఆరోపణలు చేసి పారిపోవడం మీకు అలవాటు.. ఇప్పుడు కూడా అలాగే ఆరోపణలు చేస్తున్నారు.. దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి.. అవి మేము రైతులవద్ద కొన్న భూములు.. ఇవిగో రికార్డ్స్.. పత్రాలు.. చేతనైతే అవి అటవీ భూములు అని నిరూపించండి అని సవాల్ చేసారు. అయితే పవన్ ఎప్పుడు కూడా నోటికొచ్చిన ప్రకటనలు చేయడం.. తరువాత రెండు మూడు నెలలు రాజకీయ కార్యక్రలాపాల నుంచి దూరంగా ఉండడం.. మళ్ళా టైంపాస్ కోసం రావడం పరిపాటి. దీంతో ఇప్పుడు పవన్ చేసిన ప్రకటనమీద సోషల్ మీడియాలో కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మీదే.. దమ్ముంటే విచారణ చేసి భూములు స్వాధీనం చేసుకోవాలిగానీ చేతగాని బిల్డప్ ఎందుకు పవన్ అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు..
-సిమ్మాదిరప్పన్న


