తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై రాళ్ల దాడి | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై రాళ్ల దాడి

Published Tue, May 14 2024 6:18 PM

Stone Pelting On Ysrcp Leaders In Tadipatri Constituency

తాడిపత్రి,సాక్షి: ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 

ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement