వయనాడ్‌లో బీజేపీకి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం! | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections-2024: వయనాడ్‌లో బీజేపీకి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం!

Published Thu, Apr 4 2024 12:11 PM

Smriti Irani to Join BJP Candidate Surendran Nomination - Sakshi

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సురేంద్రన్ నామినేషన్‌ కార్యకమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. నామినేషన్‌కు ముందు జరిగే రోడ్‌ షోలో స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా స్మృతి ఇరానీ  ప్రచారం చేయనున్నారు. వయనాడ్ నుంచి సీపీఐ డి రాజా భార్య అన్నీ రాజాను  ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో వయినాడ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. 

వయనాడ్ నుండి కె సురేంద్రన్ అభ్యర్థిత్వాన్ని గత వారం బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్నారు. బుధవారం ఆయన ఇక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 2019లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచారు. అదేసమయంలో యూపీలోని అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయాడు. 

కోజికోడ్ జిల్లాలోని ఉలయేరి నివాసి అయిన కున్నుమేల్ సురేంద్రన్ 2020 నుంచి కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా యువమోర్చా వయనాడ్ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పతనంతిట్ట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కె సురేంద్రన్ కేంద్ర మంత్రి వి మురళీధరన్‌కు అత్యంత సన్నిహితుడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గం నుంచి కేవలం 89 ఓట్ల తేడాతో సురేంద్రన్ ఓడిపోయారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement