Maharashtra crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు

Shinde Group MLAs Moves Supreme Court Against Disqualification Notice - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తీసుకుంది. డిప్యూటీ స్పీకర్‌ తమపై ఇచ్చిన అనర్హత వేటు నోటీసులను సవాల్‌ చేస్తూ.. షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్‌ నోటీసుతో పాటు.. శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్‌ చౌదరిని నియమించడంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ.. రెండు పిటిషన్ల దాఖలు చేసింది.
చదవండి: ‘మహా’ ట్విస్ట్‌: పోలీస్‌ శాఖతో గవర్నర్‌ చర్చలు.. రాష్ట్రపతి పాలన తప్పదా?

సోమవారం ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. కాగా.. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు వ్యక్తిగతంగా తమ వద్దకు వచ్చి అనర్హత నోటీసుపై వివరణ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ ఆదేశించడంతో.. షిండే న్యాయపోరాటానికి దిగారు. మహారాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించాలన్న శివసేన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ లేఖను శివసేన కార్యాలయ కార్యదర్శికి డిప్యూటీ స్పీకర్ కార్యాలయం పంపింది. రెబల్ ఏక్ నాథ్ షిండే స్థానంలో ఆయన ఉండనున్నారు.

మరోవైపు ఏక్‌నాథ్‌ షిండేకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. తాజాగా మరో మంత్రి సైతం ఆయన గూటికి చేరనున్నట్లు తెలిసింది. విద్యాశాఖ మంత్రి  ఉదయ్‌ సామంత్ సైతం గౌహతికి బయలుదేరినట్లు సమాచారం. ఆయన సైతం షిండే వర్గంలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top