ఆ అభిమానం మరువలేనిది 

Sanjay in the meeting of NRIs in America - Sakshi

అమెరికాలోని ఎన్నారైల భేటీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ప్రవాస భారతీయులు చూపుతున్న అభిమానానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. మోదీపై చూపుతున్న అభిమానాన్ని ఓట్లరూపంలో కురిపించాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సంజయ్‌ భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం అట్లాంటాలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.

ఆయన మాట్లాడుతూ ‘‘మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మోదీపై మీరు చూపుతున్న అభిమానం వెలకట్టలేనిది. మోదీ 9 ఏళ్ల పాలన అవినీతికి తావు లేకుండా కొనసాగుతోంది. అభివృద్ధిలో భారత్‌ ప్రపంచదేశాల్లో అగ్రగామిగా నిలవాలంటే మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందుకోసం మీరంతా సమయం తీసుకుని ఎన్నికల సమయంలో భారత్‌ రండి. మోదీ తరఫున ప్రచారం చేయడంతోపాటు ఓట్లు వేయాలి’అని కోరారు. మోదీ పాలనలో భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలను సంజయ్‌ కోరారు.   
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top