
తాడేపల్లి: విపక్ష పార్టీలకు వారిలో వారికే స్పష్టత లేదని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘ఒకరు త్యాగాలు అంటారు.. మరొకరు నేనే సీఎం అంటారు.. ఇంకొకరు మేం కలవమంటారు. చంద్రబాబు త్యాగం అంటే సీఎం పదవిని పవన్‌కు ఇస్తారా?, చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నడుస్తున్నాడు.ప్రజలంటే లెక్కలేని తనమా, పగటి కలలు కంటున్నారు’ అని మండిపడ్డారు.