
తిరుమల: రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బాబు అండ్ కో ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. శ్రీవారి కల్యాణోత్సవంలో ఆమె తన భర్త సెల్వమణితో కలిసి శనివారం పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏం ఉద్ధరించాడని ఇప్పటం వెళ్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ప్రజలకు ఆరు నెలల ముందే నోటీసులు ఇచ్చామని చెప్పారు. దానికి ప్రజల అంగీకారం తెలిపారని గుర్తు చేశారు. గడిచిన మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చర్చించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.