Rajasthan Election 2023: కాంగ్రెస్‌కు అవినీతే పరమావధి

Rajasthan Election 2023: Narendra Modi said Congress engages in corruption and dynastic politics - Sakshi

‘అహంకార కూటమి’కి మహిళా సాధికారత ఇష్టం లేదు 

రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం  

జైపూర్‌: కాంగ్రెస్‌ పార్టీకి వారసత్వ రాజకీయాలు, అవినీతి మాత్రమే పరమావధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలతో కూడిన ‘అహంకార కూటమి’కి మహిళా సాధికారత అంటే ఎంతమాత్రం ఇష్టం లేదని అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడాన్ని ఆ పారీ్టలు జీరి్ణంచుకోలేకపోయానని, మహిళా సాధికారితకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాయని మండిపడ్డారు.

మన తల్లులు, సోదరీమణులు గురించి విపక్ష నాయకులు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. బిహార్‌ అసెంబ్లీలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి మహిళలను కించపర్చేలా మాట్లాడితే కాంగ్రెస్‌ పార్టీ నోరెత్తలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అసలు రంగును రాజస్తాన్‌ ప్రజలు గుర్తించారని తెలిపారు.

సోమవారం రాజస్తాన్‌లోని పాలీ, హనుమాన్‌గఢ్‌ జిల్లాలో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేసిందని, సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి కుట్రలు పన్నిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని, బీజేపీని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వమే రాష్ట్రానికి ఇప్పుడు అవసరమని చెప్పారు.  

కాంగ్రెస్‌ పాలనలో ప్రజల సొమ్ము లూటీ
రాజస్తాన్‌లో దళితులపై అరాచకాలు, వేధింపులు జరిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధాని మోదీ తప్పుపట్టారు. కళ్ల ముందు ఘోరాలు జరుగుతున్నా స్పందించలేదని అన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అల్లర్లు, ఉగ్రవాదం పెచ్చరిల్లాయని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఆలోచన తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించలేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే రాజస్తాన్‌ సంస్కృతిని నిర్మూలించడమే అవుతుందని తేలి్చచెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ ఎప్పుడు, ఎక్కడ అధికారంలో ఉన్నా సరే అవినీతి, బంధుప్రీతికే అత్యధిక ప్రాధాన్యం దక్కుతుందని అన్నారు. కేంద్రంలో 2014 కంటే ముందు కాంగ్రెస్‌ పాలనలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రజల సొమ్మును విచ్చలవిడిగా లూటీ చేశారని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top