ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్‌ మాటామంతి | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్‌ మాటామంతి

Published Tue, Nov 28 2023 11:32 AM

Rahul Meet Auto Drivers Delivery Boys And Sanitation Workers - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ వర్గాలతో రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌, పారిశుధ్య కార్మికులతో మాటామంతి జరిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంపాదించినదంతా డీజీల్‌, పెట్రోల్‌కే సరిపోతుందని ఆటోడ్రైవర్లు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయాలు కల్పించాలని డెలివరీ బాయ్స్‌ విజ్ఞప్తి చేశారు.

గిగ్‌వర్కర్స్‌ సోషల్‌ సెక్యూరిటీ కోసం రాజస్థాన్‌లో ఒక స్కిమ్‌ అమలు చేస్తున్నామని, ప్రతి ట్రాన్సాక్షన్‌లో కొంత మొత్తాన్ని గిగ్‌ వర్కర్స్‌ సోషల్‌ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నామని రాహుల్‌ తెలిపారు.
చదవండి: కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్‌ వ్యూహం ఫలించేనా?

Advertisement
 
Advertisement