దుబ్బాకలో మంత్రి ఎందుకు భయపడుతున్నారు..? | Raghunandan Rao Spoke To Media Over Dubaka Election | Sakshi
Sakshi News home page

ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం: రఘునందన్

Oct 20 2020 2:56 PM | Updated on Oct 20 2020 3:26 PM

Raghunandan Rao Spoke To Media Over Dubaka Election - Sakshi

సాక్షి, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోమవారం రోజున తూప్రాన్‌ వద్ద మూడు గంటల వరకు వాహనం తనిఖీ చేయకుండా నిలిపేశారు. ఫోన్‌ లాక్కోని వాహనాన్ని తనిఖీ చేస్తున్న వీడియోలను తొలగించారు. నిన్న రాత్రి అదే వాహనాన్ని 8 గంటల సమయంలో తనిఖీ పేరుతో ఆపారు. అనంతరం ఫోన్‌ తీసుకొని అందులోని డాటా అంతా ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు.  (బండి సంజయ్‌తో చర్చకు ఎక్కడైనా సిద్ధమే)

రాత్రి ఒంటి గంట వరకు కూడా వాహనాన్ని తనిఖీ చేసే టీమ్‌ రాలేదు. తర్వాత పోలీసులు అక్కడకు చేరుకొని కారును మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా మంత్రి పోలీసులను నడిపిస్తూ.. కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దుబ్బాకలో బీజేపీకి మంత్రిగారు ఎందుకు భయపడుతున్నారు..?. 2014 నుంచి ఇప్పటిదాకా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయండి. మంత్రి హరీష్‌ రావు ఎల్కల్‌ గ్రామ సర్పంచ్‌తో మాట్లాడిన ఆడియో మా దగ్గర ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం' అని రఘనందన్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement