చంద్రబాబు నెంబర్‌వన్‌ కిలాడీ: పోసాని | Posani Krishna Murali Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నెంబర్‌వన్‌ కిలాడీ: పోసాని

Apr 10 2024 3:32 PM | Updated on Apr 10 2024 4:24 PM

Posani Krishna Murali Fires On Chandrababu - Sakshi

వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. క్యాన్సర్‌ గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారంటూ ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.

సాక్షి, గుంటూరు: వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. క్యాన్సర్‌ గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారంటూ ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వాలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నారని, లోకేశ్‌లా వాలంటీర్లు వ్యవహరించడం లేదన్నారు.

‘‘చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా, చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదు. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడమే వారి లక్ష్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను నమ్మొద్దు. సుజనా చౌదరిని తిట్టడానికి కొత్త భాష సృష్టించాలి. చంద్రబాబు నెంబర్‌వన్‌ కిలాడీ. తన రాజకీయ భవిష్యత్‌ కోసం చంద్రబాబు వంగావీటి రంగాను హత్య చేయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనికిరారు. అన్ని సామాజిక వర్గాల వారికి సీఎం జగన్‌ పథకాలు అందిస్తున్నారు’’ అని పోసాని చెప్పారు.

వలంటీర్లపై చంద్రబాబుది మొసలి కన్నీరు. వాలంటీర్లు తలుపులు కొట్టేవారని అన్నాడు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్లంటూ వలంటీర్లపై దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లు లోకేశ్‌లా తాగుబోతు, తిరుగుబోతు, లోఫర్‌లు కాదు. వలంటీర్లను ప్రజలు తమ్ముడు, అన్న, బిడ్డలా చూసుకుంటారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. జయప్రద జీవితాన్ని నాశనం చేసింది చంద్రబాబు. రామోజీరావుతో కలిసి లక్ష్మీ పార్వతి జీవితాన్ని నాశనం చేశాడు. మహిళలను చంద్రబాబు చాలా చులకనగా చూస్తాడు. బాలకృష్ణ ఆడవాళ్లు కనిపిస్తే కడుపు చేయాలంటూ మాట్లాడాడు’’  అని పోసాని గుర్తు చేశారు.

‘‘నేను కమ్మ కులస్తుడిని కాబట్టి చంద్రబాబుని తిట్టొద్దంటున్నారు. అవినీతి పరుడు, దొంగ కమ్మ వాడైతే..నేను మద్దతు ఇవ్వాలా?. మరి రాధాకృష్ణ గతంలో సుజనా చౌదరి అవినీతిపై రాయలేదా?. ఈనాడు రామోజీరావు కూడా సుజనా ఎన్ని వేల కోట్లు మోసం చేశాడో రాశారుగా.. అలాంటి వాళ్లు ఇప్పుడు కూటమి అభ్యర్థ. దున్నపోతులా సుజనా చౌదరి వేల కోట్లు తిన్నాడు. దొంగలు అందరూ కలిసి సీఎం జగన్‌ని దించాలని  తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అంటూ పోసాని కృష్ణ మురళీ దుయ్యబట్టారు.

పురంధేశ్వరి రాజకీయ అవకాశ వాది. బీజేపీలో ఉండి చంద్రబాబు కోసం పని చేస్తున్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని లేఖ రాసింది పురందేశ్వరి. మరి సుజనా చౌదరి కేసులపై ఎందుకు లేఖ రాయలేదు?. మళ్లీ ఈ ప్రభుత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వలంటీర్లకు 10 వేలు ఇస్తామని చంద్రబాబు డ్రామా ఆడుతున్నాడు. గతంలో 600 హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చెయ్యలేదు. ఒక్క హామీ అమలు చేసినట్టు చూపించు’’ అని చంద్రబాబుకు పోసాని కృష్ణమురళీ సవాల్ విసిరారు.


ఇదీ చదవండి: ఎల్లో బ్యాచ్‌ వారి వాషింగ్‌ మెషిన్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement