
సాక్షి, అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే ర్యాలీగా వెళ్లిన నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రికత్త చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.
