ఈటల బావమరిదిపై పోలీసులకు ఫిర్యాదు

Police Case Against Etela Rajender Ralatives In Karimnagar - Sakshi

సాక్షి, హుజూరాబాద్‌ (కరీంనగర్‌): దళితులను అవమానించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో గురువారం దళిత ప్రజాప్రతినిధులు ఎమ్మార్పీఎస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హుజూరాబాద్‌లో రుద్రారపు రాంచంద్రం టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. ఇల్లందకుంట మండలకేంద్రంలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మికుంటలో జమ్మికుంట జెడ్పీటీసీ, ఎంపీపీ శ్రీరాంశ్యామ్, దొడ్డెమమత, దళిత సంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జమ్మికుంటలో ఫిర్యాదు చేసిన వారిలో అంబాల ప్రభాకర్, వాసాల రామస్వామి, మైస మహేందర్‌ తదితరులు ఉన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top