‘10 రోజుల్లో 12 రాష్ట్రాలు’, దేశంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. | PM Modi To Visit 12 States In 10 Days | Sakshi
Sakshi News home page

‘10 రోజుల్లో 12 రాష్ట్రాలు’, దేశంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు..

Mar 4 2024 10:27 AM | Updated on Mar 4 2024 10:46 AM

Pm Modi To Visit 12 States In 10 Days - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ 10 రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మార్చి 4 నుంచి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. షెడ్యూల్‌లో భాగంగా నేడు నాగపూర్‌ నుంచి తెలంగాణలోకి ఆదిలాబాద్‌కు చేరుకోనున్నారు.    

తెలంగాణ తర్వాత తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ - కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ పర్యటించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంలో భాగంగా వ్యూహాత్మకంగా 29 కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ విభిన్న ప్రాంతాలు వర్గాలతో అనుసంధానం అయ్యేలా, కీలకమైన సమస్యలను పరిష్కరిష్కరించనున్నారు. ఇక ఎన్నికలకు ముందు ప్రజల్ని ఆకట్టుకునేందుకు మోదీ పర్యటన దోహదం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement