
సాక్షి,కృష్ణాజిల్లా: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనొద్దని నేను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పామర్రు మీటింగ్‌లో చెప్పా.నేను ఎవరినీ నరకమని చెప్పలేదు. 8వ తేదీన మాట్లాడితే 12వ తేదీన టీడీపీ డబ్బులిచ్చి పోషించే టీవీల్లో నాపై డిబేట్లు పెట్టారు. పచ్చ పార్టీ మహిళలతో నన్ను బూతులు తిట్టించారు.
చీకట్లో నేను తలలు నరికేయమన్నానని టీడీపీ ఛానల్స్‌లో ప్రచారం చేశారు. వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. జగన్‌ను భూస్థాపితం చేయడం చంద్రబాబు తరమా...అతని కొడుకు లోకేష్ తరమా?
రోజులు లెక్కపెట్టుకో కొల్లు రవీంద్ర. వెనుకబడిన వర్గాలకు చెందిన ఆడబిడ్డ కన్నీరు మీ పచ్చ సైకోలను ఇంటికి పంపించడం ఖాయం.
ఓయ్ సొల్లు రవీంద్ర మేం అన్నం తింటున్నాం. నీలాగా మందు బాటిల్ మీద వచ్చే రూపాయి తినడం లేదు. సొంత అన్న కొడుకుల స్థలం కొట్టేసిన నువ్వు అన్నం తినడం లేదు.బందరు బీచ్‌లో ఇసుక తింటున్నావ్..నువ్వు అన్నం తినడం లేదు.
తోట్ల వల్లూరులో ఇసుక తింటున్నావ్.. నువ్వు అన్నం తినడం లేదు. 2024 ఎన్నికల అఫిడవిట్ లో నీ ఆదాయం కోటి రూపాయలు లేదు.
కానీ ఇప్పుడు నువ్వు కొంటున్న స్థలాలకు.. ఇస్తున్న డొనేషన్లకు కోట్ల రూపాయల డబ్బులెక్కడివి. కొల్లు రవీంద్ర నీ దోపిడీ బందరును దాటి కృత్తివెన్ను వరకూ పాకింది.ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి కొల్లు రవీంద్ర అన్నం తినడం మానేసి ఏం తిన్నాడో ఆధారాలతో చూపించబోతున్నా’అని హెచ్చరించారు.