‘లోకేష్‌, అనితా.. నిజాలు తెలుసుకొని మాట్లాడండి’ | Pattikonda Ex MLA Sridevi Slams Nara Lokesh Over Hosur Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

‘లోకేష్‌, అనితా.. నిజాలు తెలుసుకొని మాట్లాడండి’

Aug 19 2024 1:56 PM | Updated on Aug 19 2024 2:58 PM

pattikonda ex mla sridevi slams on nara lokesh over hosur incident

కర్నూలు, సాక్షి : నిజాలు తెలుసుకోకుండా మంత్రులు నారా లోకేష్, అనితా అసత్య ఆరోపణలు చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. 

‘మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ హత్య రాజకీయాలు చేయలేదు. టీడీపీ పార్టీ నేతల వర్గా విబేధాలుతోనే ఈ హత్య జరిగింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే కేయి శ్యాం బాబు, మంత్రి బురద జల్లే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. హోసూరులో జరిగిన హత్యను తప్పు పుట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. 

హోసూరు గ్రామంలో జరిగిన ఘటనలో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా మా పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement