రేవంత్‌ను నమ్మారా.. నమ్మితే నట్టేట మునిగినట్లే : పాడి | padi kaushik reddy slams cm revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ను నమ్మారా.. నమ్మితే నట్టేట మునిగినట్లే : పాడి

Jan 30 2025 7:13 PM | Updated on Jan 30 2025 7:41 PM

padi kaushik reddy slams cm revanth reddy

సాక్షి,తెలంగాణ భవన్‌ : సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. ఎవ్వరి సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి. ఈ పత్రాలు చూసి ఇళ్ళు కట్టుకుంటే ప్రజలు మోసపోతారు ..తస్మాత్ జాగ్రత్త. రాష్ట్ర  ప్రజలు ఎవ్వరూ మోసపోవద్దు ..ఇండ్లు కట్టుకున్న తర్వాత రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వరు. 

స్థలం  లేని వారికి  ఇండ్ల కేటాయింపులో స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి ఓ పెద్ద జోకర్‌లా మారారు. తుగ్లక్‌లా పాలిస్తున్నారు. ఓ మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారు.కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది ఆయన తీరు.  టకీ టకీ అని రైతు భరోసా డబ్బులు పడతాయని రేవంత్ అన్నారు.
ఒక్క రోజు డబ్బులు వేసి ఆపేశారు.

 

ఆరునెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసాను ఆపే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో ఎవరి పాలన బాగుంది అంటే కేసీఆర్ పాలన బాగుంది అని 70 శాతం నెటిజన్లు సమాధానమిచ్చారు. దాదాపు 90  వేల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించారు.

మరో ఛానల్ నిర్వహించిన సర్వేలో కూడా 80 శాతం మంది కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. అన్ని పథకాలు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement