
నారా భువనేశ్వరి సమక్షంలో రాజోలు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
సాక్షి, కోనసీమ జిల్లా: నారా భువనేశ్వరి సమక్షంలో రాజోలు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నారా భువనేశ్వరి పర్యటనలో మహిళా సర్పంచ్‌కు అవమానం జరిగింది.రాజోలు మండలం శివకోడులో నారా భువనేశ్వరిని కలవడానికి తాటిపాక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల రాగా, ఆమెను లోపలికి రానివ్వకుండా గొల్లపల్లి సూర్యారావు వర్గీయులు తోసేశారు.
ఇటీవల రాజోలులో జరిగిన లోకేష్ పాదయాత్ర లో సర్పంచ్ రత్నమాల ప్లెక్సీలను గొల్లపల్లి వర్గం చించేశారు. అప్పట్లో టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే.