దళితులను అడ్డుపెట్టుకొని బాబు రాజకీయం

Nandigam Suresh Fires On Chandrababu Naidu - Sakshi

బాబు కుయుక్తులకు బలికావొద్దు

వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ ధ్వజం

సాక్షి, అమరావతి: అమరావతి రైతుల జీవితాలతో గతంలో ఆడుకున్నది.. ఇప్పుడు ఆడుకుంటున్నది.. ప్రతిపక్ష నేత చంద్రబాబేనని, అధికారంలో ఉండగా తన సొంత సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే బాబు.. అధికారం కోల్పోయాక దళితులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు బేడీలు వేశారని తెలిసిన మరుక్షణమే సీఎం వైఎస్‌ జగన్‌ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. అమరావతి రైతులకు బేడీలు వేశారంటూ దళిత మేధావులు అని చెప్పుకునే కొంతమంది చంద్రబాబు తొత్తులుగా మారి మాట్లాడుతున్నారని, ఇదే రాజధాని ప్రాంతంలో బాబు హయాంలో అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైనప్పుడు వీరంతా ఎక్కడికి పోయారని నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 

► అమరావతిలో దళితులు ఉంటే భవిష్యత్తులో తన ఆటలు సాగవని చంద్రబాబుకు భయం పట్టుకుంది. అధికారంలో ఉంటే పక్కన దాయాదులను, అధికారంలో లేకపోతే దళితులను బాబు అడ్డు పెట్టుకుంటారు.  
► అమరావతిలో జరుగుతున్నది ఒకటి, టీడీపీ చెప్తోంది మరొకటి. సీఎం వైఎస్‌ జగన్‌ దళితులకు, పేదలకు 54 వేల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే అడ్డుకుంటోంది చంద్రబాబే.  
► కరెంట్‌ చార్జీల పెంపుపై బషీర్‌బాగ్‌లో రైతులు ఆందోళన చేస్తే అన్నదాతల గుండెల్లోకి తూటాలు దించిన నీచ చరిత్ర చంద్రబాబుది.  
► ఇసుక రీచ్‌ల వద్ద దోపిడీకి అడ్డుపడుతున్నారని పది మందిని భారీ వాహనాలతో తొక్కించి చంపింది చంద్రబాబే. పుష్కరాల్లో ఎంతమందిని చంపారో ప్రజలకు తెలుసు.  
► చంద్రబాబు దుర్మార్గాలకు ఎక్కువగా ఇబ్బందులు పడింది దళితులే. ఆనాడు నన్ను అరెస్ట్‌ చేసి 48 గంటలపాటు చిత్రహింసలు పెట్టినప్పుడు ఈ దళిత మేధావులంతా ఏమయ్యారు. నేను దళితుడినే కదా, ఒక్కరైనా వచ్చి పరామర్శించారా? 
► దళితుల కళ్లను దళితులతోనే పొడిపించే వ్యక్తి చంద్రబాబు. ఆయనకు తబలా బృందంగా కొదరు దళిత మేధావులు మారిపోవటం బాధాకరం. 
► ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా చంద్రబాబును ఓడించారు. కాబట్టి వారి జీవితాలతో ఆడుకోవాలని బాబు చూస్తున్నారు. 
► దళితులకు అండగా నిలిచే ప్రభుత్వం ఇది. దళితులకు ఏ కష్టం వచి్చనా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, నాయకులు అండగా ఉంటారు.  
► బాబు కుయుక్తులకు దళితులు బలికావొద్దు. ఆయన చెప్పారని తప్పుదారిలో నడవొద్దు. చంద్రబాబు ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలి.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top