నారా లోకేష్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి సవాల్‌

Mp Mithun Reddy Challenges Nara Lokesh - Sakshi

సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలం తొండవాడలో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సభ శుక్రవారం నిర్వహించారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడప్ప, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా అభివృద్ధిపై నారా లోకేష్‌తో చర్చకు సిద్ధమంటూ సవాల్‌ విసిరారు. ‘‘దమ్ముంటే ఈ నెల 12న చర్చకు రావాలి. చిత్తూరు జిల్లా డీఎన్‌ఏ నీలో ఉంటే జిల్లాలో ఏదో ఒక చోట పోటీ చేయాలన్నారు.

‘‘విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి ఆపేస్తాం అంటూ లోకేష్ మాట్లాడుతున్నారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. విశాఖ సమ్మిట్‌లో లక్షలు కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో చంద్రగిరి ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. కరోనా సమయంలో చెవిరెడ్డి అన్న మీ ఇంటి గడప గడపకు వచ్చి అండగా నిలిచారు’’ అని మిథున్‌రెడ్డి అన్నారు.

‘‘2014లో డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ మోసం చేసింది. మోసపూరిత వాగ్ధానాలతో మళ్లీ టీడీపీ నేతలు వస్తున్నారు. వారి మాటలు నమ్మొద్దు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి చెవిరెడ్డి... గత ప్రభుత్వం హయాంలో ఆయనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే  టీడీపీ నేతలు ఏడుస్తున్నారు. మహిళల అభివృద్ధికి, చదువుకు, పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తుంటే ఎందుకు వద్దంటున్నారు’’ అంటూ ఎంపీ మిథున్‌రెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: సీబీఐ కట్టుకథలు అల్లుతోంది: ఎంపీ అవినాష్‌రెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top