సీఎం కేసీఆర్‌ డైనమిక్‌ లీడర్‌  | MP Bandi Parthasaradhi Reddy Praised Telangana CM KCR | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ 

Nov 19 2022 3:45 AM | Updated on Nov 19 2022 3:45 AM

MP Bandi Parthasaradhi Reddy Praised Telangana CM KCR - Sakshi

సత్తుపల్లి: సీఎం కేసీఆర్‌ అపరమేధావి.. ఒకే సమయంలో ఎన్ని పనులైనా చేయగలిగిన డైనమిక్‌ లీడర్‌ అని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి కొనియాడారు. ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన డాక్టర్‌ బండి పార్ధసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రను ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన సన్మానించారు. సభలో పార్ధసారథి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి తుదిశ్వాస ఉన్నంత వరకు సీఎంగా కేసీఆరే ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్‌ దక్కకుండా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పని చేయాలని కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగు చూశాక బయటకు రాని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ సభకు హాజరుకాగా.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.  

Advertisement
 
Advertisement
Advertisement