
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల మొదటివారంలో తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో ఏదో ఒకరోజు ఈ పర్యటన ఉండొచ్చంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ప్రారంభోత్సవంతో పాటు నిజామాబాద్‌లో రోడ్‌షో నిర్వహించాలని, లేని పక్షంలో మహబూబ్‌నగర్‌లో గానీ, నిజామాబాద్‌లో గానీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోంది.