ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేధింపు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం | MLA Vemireddy Prashanthi harasses TDP leaders | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేధింపు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

Jul 11 2025 1:44 PM | Updated on Jul 11 2025 3:43 PM

MLA Vemireddy Prashanthi harasses TDP leaders

సాక్షి,నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేల వేధింపులు తాళ లేక ఆ పార్టీ నేతలు  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపుల్ని భరించలేక జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ భాషా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. 

కోవూరు నియోజకవర్గంలోనీ విడవలూరు మండలం ముదువర్తి గ్రామ పార్టీ కార్యాలయంలో ఇమామ్‌ భాషా మీడియాతో మాట్లాడారు. ప్రశాంతి రెడ్డి ఘోరంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన అవమానాన్ని తాను తట్టుకోలేకపోతున్నానంటూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement