Minister Vemula Prashanth Reddy On Congress Khammam Meeting - Sakshi
Sakshi News home page

‘వాపును చూసి.. బలుపు అనుకుంటున్న కాంగ్రెస్‌’ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

Jul 3 2023 10:50 AM | Updated on Jul 3 2023 12:01 PM

Minister Vemula Prashanth Reddy On Congress Khammam Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల్లో గెలు పుతో కాంగ్రెస్‌ పార్టీ భ్రమల్లో బతుకు తోందని, ఆ పార్టీ నాయ కులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజ మెత్తారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన భీంగల్, ముచ్కూర్, బాబాపూర్‌ గ్రా మాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు, పలువురు యువకులు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం కేసీఆర్‌ కంటే ముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రైతులు, పేదలకు ఏం చేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పాచికలు తెలంగాణలో పారవన్నారు. కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ తెలంగా ణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్ర« దాని మోదీ దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలకు అన్యాయంగా తరలిస్తుంటే ఇక్కడి బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియో జకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు.  

కాంగ్రెస్‌.. భారత రాబందుల పార్టీ: కేటీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: ‘మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు, మీదే భారత రాబందుల పార్టీ. ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్‌ కమిటీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ పారీ్ట’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభ వేదికగా రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ మండిపడ్డారు.

‘మా పార్టీ బీజేపీకి బీ టీమ్‌ కాదు, కాంగ్రెస్‌ పారీ్టకి సీ టీమ్‌ అంతకన్నా కాదు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే ‘డీ టీమ్‌’బీఆర్‌ఎస్‌’అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా, ఈ మిస్‌ ఫైరింగ్‌లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్‌ పారీ్టయే అంటూ మండిపడ్డారు. లక్ష కోట్లు వ్యయంకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్‌ అర్ధంలేని ఆరోపణలతో నవ్వుల పాలవుతోందన్నారు. ధరణి రద్దు చేసి దళారుల రాజ్యాన్ని తెస్తే ప్రజలు క్షమించరని, రూ.4వేల పెన్షన్‌ను ఎవరూ నమ్మరని, డిక్లరేషన్‌లను విశ్వసించరన్నారు. 

దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది: హరీశ్‌రావు 
సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని, అందుకే దేశ ప్రజలు వారిని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీటీమ్‌ కాదని, తమది పేదలు, ప్రజా సంక్షేమం చూసే ఏ క్లాస్‌ టీమ్‌ అని వ్యాఖ్యానించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేనందునే దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టిందన్నారు. స్కామ్‌లలో ఆరితేరిన కాంగ్రెస్‌ కుంభకోణాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ఖమ్మంలో పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు, రాసిచి్చన స్క్రిప్ట్‌ తో రాహుల్‌ స్కిట్‌ వేశారని హరీశ్‌ ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement