తండ్రీ, కొడుకులు మొసలి కన్నీరు కారుస్తున్నారు: ఆదిమూలపు సురేష్‌

Minister Adimulapu Suresh Slams Nara Lokesh And Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: అసలు లోకేష్‌కు ఎయిడెడ్‌ విద్యాసంస్థలంటే ఏంటో తెలుసా ​అని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. ఈ మేరకు తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పమనండి. టీచర్లను ప్రభుత్వంలోకి తీసుకోవడం వల్ల వారు ఆనందంగా ఉన్నారు. ఆయా సంస్థలు ప్రభుత్వంలో కలవాలా వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేశాం. ఇక అందులో సమస్య ఏముంది..?. అసలు చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఎయిడెడ్‌ విద్యాసంస్థల గురించి ఆలోచించారా..?. ఈ రోజు వచ్చి తండ్రీ, కొడుకులు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఆనాడు ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ టీచర్ల నియామకాలు చేసేది లేదని చెప్పింది చంద్రబాబు కాదా?.

చదవండి: (రైతుల పాదయాత్ర పేరుతో రాజకీయ యాత్ర)

అనంతపురం సంఘటనలో రాళ్లు వేసింది ఎవరు? విద్యార్థిని స్పష్టంగా రాళ్లు వేశారని చెప్తుంటే లాఠీచార్జి అంటారేంటి..?. విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్న తరుణంలో ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని ఇలాంటివి చేస్తున్నారు. విద్యాశాఖకు సంబంధించి ముప్పైకి పైగా కేసులు వేయించారు. ఒక్కదాంట్లో అయినా కోర్టు స్టే ఇచ్చిందా?. కావాలని విద్యార్థులను రెచ్చిగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. వీరి కుటిల రాజకీయాలకు ఇక్కడ తావులేదు. ఫీజులు పెరుగుతాయంటూ తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ఎలా పెరుగుతాయో చెప్పండి కావాలంటే నేను చర్చకు సిద్ధం. వీళ్లెన్ని చేసినా విద్యా వ్యవస్థలో అందరికీ న్యాయం జరిగే దిశగా మా చర్యలు ఉంటాయి అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

చదవండి: (ఎయిడెడ్‌పై చంద్రబాబు ఆందోళనలు విడ్డూరం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top