TS: ఎన్నికలు ఇప్పుడు పెట్టినా కేసీఆర్‌దే అధికారం.. సర్వేలో ట్విస్టులు

Mastan Survey Said TRS Will Win Again In Telangana - Sakshi

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో మరోసారి తమదే అధికారం అని టీఆర్‌ఎస్‌ ధీమా వక్తం చేస్తుండగా.. ఈసారి తామే సర్కార్‌ ఏర్పాటు చేస్తామని కాషాయ పార్టీ ప్లాన్స్‌ రచిస్తోంది. అటు కాంగ్రెస్‌ కూడా తామకే ప్రజలు అనుకూలంగా ఉన్నారని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో ఆరా మస్తాన్‌ సర్వే తెలంగాణలో ఎన్నికలపై ​సంచలన రిపోర్టును బహిర్గతం చేసింది. 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్‌ఎస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది. గులాబీ పార్టీనే ఆధిక్యంలో ఉందని స్పష్టం చేసింది. సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్‌కు 23.71 శాతం, ఇతరులకు 6.93 శాతం ఓట్లు వస్తాయని సర్వే రిపోర్టులో పేర్కొంది. కాగా, మస్తాన్‌ సర్వే అంతకుముందు కూడా హుజురాబాద్‌ ఫలితాలు, ఏపీలో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని సర్వేలో ముందే చెప్పినట్టు గుర్తు చేసింది. 

ఇక పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 5శాతం ఓట్లు కోల్పోతుందని సర్వేలో పేర్కొంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 23.5 శాతం అధిక ఓట్లను పొందనుంది. కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో 4.72 శాతం ఓట్లను కోల్పోనున్నట్టు సర్వే నివేదిక తెలిపింది. కాగా, పరిస్థితి ఇలానే ఉంటే టీఆర్‌ఎస్‌కు ఇంకో 8 శాతం ఓట్లు తగ్గుతాయని స్పష్టం చేసింది.   

- ఖమ్మం, నల్గగొండ, వరంగల్‌లో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య పోటీ.

- మెదక్‌, మహబూబ్‌నగర్‌లో త్రిముఖ పోటీ.

- ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ.

- హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ. 

-ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వైఎస్సార్‌టీపీ బలమైన పార్టీగా ఎదుగుతుంది. 

మరోవైపు.. టీఆర్‌ఎస్‌-87, బీజేపీ-29, కాంగ్రెస్‌కు53 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని సర్వే వెల్లడించింది. ఇక, ఆంధ్రా సెటిలర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. నార్త్‌ ఇండియా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుతున్నారని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top