రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు

Published Sun, Apr 7 2024 10:37 AM

Many Like You Have Come And Gone Says Smriti Irani About Rahul Gandhi - Sakshi

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గెలుపొందే దిశగా కీలక నేతలు, అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ మొదలైనవారు బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి కీలకోపన్యాసాలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి 'స్మృతి ఇరానీ' చెన్నైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

చెన్నైలోని వెప్పేరి జిల్లాలోని వైఎంసీఏ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ చెన్నై బీజేపీ అభ్యర్థి వినోజ్ పీ సెల్వంకు మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తూ స్మృతి ఇరానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

రాహుల్ గాంధీ మాదిరిగా ఎందరో వచ్చారు, పోయారు. అయితే హిందూస్తాన్ మాత్రం అలాగే ఉందని స్మృతి ఇరానీ అన్నారు. జై శ్రీరామ్ అంటూనే ప్రజలను చంపినవారు ఇండియా కూటమిలో ఉన్నారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా వీరు దూరంగా ఉన్నారని అన్నారు. బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు.

త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. దేశం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా అది బీజేపీతోనే సాధ్యమవుతుంది. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ దేశాన్ని మోదీ చేతికి అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నారు.

Advertisement
Advertisement