
బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి' అనే సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో ఈ సీరియల్ ద్వారానే ఫేమ్ తెచ్చుకున్న స్మృతి ఇరానీ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి-2' సీక్వెల్ ద్వారా మరోసారి తులసి విరానీగా బుల్లితెర అభిమానులను అలరించనుంది. ఈ నెలలోనే ప్రసారం కానున్న ఈ సీిరియల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి-2' సీక్వెల్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోన్న స్మృతి ఇరానీ భారీగానే రెమ్యుననేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2000లో ఈ షో ప్రారంభించినప్పుడు ఒక్కో ఎపిసోడ్‌కు కేవలం రూ.1800 రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ పాత్రకు ఎపిసోడ్‌కు ఏకంగా రూ.14 లక్షల పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం స్మృతి ఇరానీ రెమ్యునరేషన్‌పై టాక్ నడుస్తోంది. తాను ఒక పెద్ద స్టార్ అవుతానని జ్యోతిష్యంలో చెప్పారని గత ఇంటర్వ్యూల్లో ఆమె వెల్లడించారు. మొదట తాను మెక్‌డొనాల్డ్స్‌లో ఉద్యోగం చేసే సమయంలో నెలకు కేవలం రూ.1800 జీతం మాత్రమే అందుకున్నట్లు తెలిపారు.
కాగా.. 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి-2' సీరియల్ జూలై 29 నుంచి స్టార్ ప్లస్‌లో ప్రీమియర్ కానుంది. ఇటీవల స్మృతి ఇరానీ.. తులసి విరానీ పాత్రలో నటించిన ప్రోమోను షేర్ చేశారు.