శివసేనలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే

Maharashtra: Independent MLA Shankarrao Gadakh Joins Shiv Sena - Sakshi

ముంబై : మహారాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ రావు గదఖ్ అధికార శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శంకర్‌ రావు అహ్మద్ నగర్ జిల్లా నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వా శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరి భూమి, జలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం శివసేనాధిపతి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి వచ్చిన శంకర్ రావు శివసేన పార్టీలో చేరారు. తమ పార్టీలో చేరిన శంకర్ రావుకు సీఎం ఠాక్రే శివ బంధన్‌ను కట్టి పార్టీలోకి ఆహ్వానించారు. (సుశాంత్‌ కేసు: ‘మహా’ప్రభుత్వంపై కేంద్రం కుట్ర)

ఈ కార్యక్రమానికి పార్టీ కార్యదర్శి మిలింద్‌ నార్వేకర్‌ కూడా హాజరయ్యారు. కాగా ఇప్పటి వరకు మహా వికాస్ అఘాడి(శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ) ప్రభుత్వంలో ఉన్న ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం. ప్రస్తుతం శంకర్‌ రావు పార్టీలో చేరడంతో శాసనసభలో శివసేన బలం 57కు పెరిగింది. యూత్‌ కాంగ్రెస్‌ ప్రచారకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గదఖ్‌ 2017లో క్రాంతికారి శెట్కారి పక్ష పార్టీని స్థాపించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు. (సుశాంత్‌ కేసు: మహారాష్ట్ర వర్సెస్ బిహార్)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top