ఆ మర్డర్‌ వెనుక నువ్వు, రామోజీ లేరా?: లక్ష్మీపార్వతి | Sakshi
Sakshi News home page

ఆ మర్డర్‌ వెనుక నువ్వు, రామోజీ లేరా?: లక్ష్మీపార్వతి

Published Mon, Sep 26 2022 11:45 AM

Lakshmi Parvathi Condemn Yellow Media Fake propaganda - Sakshi

సాక్షి, తాడేపల్లి: అధికార దాహంతో చంద్రబాబునాయుడు ఎల్లోమీడియాలో తనపై పిచ్చి కూతలు రాయిస్తున్నారంటూ తెలుగు అకాడమీ చైర్మన్‌ లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి స్వార్థం కోసం ఎన్టీఆర్‌ జీవితంలోకి రాలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానం గురించి అందరికీ తెలుసన్నారు. ఏరోజూ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. అల్లుళ్ల కొట్లాట వల్లే 1989లో ఓడిపోయామని ఎన్టీఆర్‌ ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ జీవితంలోకి ఆమె ప్రవేశించాక టీడీపీ ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గతంలో ఎన్టీఆర్‌ మాట్లాడిన వీడియోని లక్ష్మీ పార్వతి ప్రదర్శించారు. 'చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు అధికార దాహం ఉంటే ఆనాడు చంద్రబాబుకు రెండు పదవులు వచ్చేవా?. చంద్రబాబు నమ్మించి గొంతుకోస్తాడని ఎన్టీఆర్‌ నాతో చాలాసార్లు చెప్పారు. అయితే ఎన్టీఆర్‌కు ద్రోహం చేయబోనని చంద్రబాబు నాకు ప్రమాణం చేశారు. పాముకు పాలుపోస్తున్నావని చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఆనాడే అన్నారు. 

చంద్రబాబు రోజుకో అబద్ధం మాట్లాడతాడు. ఈ రోజు తండ్రి గురించి మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు సిగ్గుపడాలి. ఇప్పటికైనా పశ్చాత్తాప పడరా?. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈటీవీని లాంచ్‌ చేశారు. రామోజీ పిచ్చి రాతలపై అప్పట్లోనే ఎన్టీఆర్‌ స్పందించారు. ఎన్టీఆర్‌పై ఈనాడులో పిచ్చిపిచ్చి కార్టూన్లు వేశారు. ఎల్లోమీడియా ఎన్టీఆర్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచింది. తప్పుడు ప్రచారంతో ఎమ్మెల్యేల్లో భయాందోళన సృష్టించారు. అప్పటి స్పీకర్‌ యనమల వెన్నుపోటులో భాగమయ్యాడు. వైశ్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు వేయించిన సంగతి గుర్తులేదా?.

రామోజీరావు, చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే కుట్ర చేశారు. ఎన్టీఆర్‌ ప్రధాని అవుతారన్న భయంతోనే కుట్ర చేశారు. ఎన్టీఆర్‌ను చంపిన హంతకులు గురించి అందరికీ తెలియాలి. అధికారంలో ఉన్న ఏరోజైనా ఎన్టీఆర్‌ పేరు పెట్టావా చంద్రబాబూ?. ఎన్టీఆర్‌ పేరు తీసేయాలని రాధాకృష్ణ, నువ్వు మాట్లాడుకోలేదా?. ఎన్టీఆర్‌ది హత్యా? కాదా?. ఆ హత్య వెనుక నువ్వు, రామోజీ లేరా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement